Young Rebel Star Prabhas: రణ్ బీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ వన్ ఓ మాదిరి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అందరి కళ్ళు పార్ట్ 2 మీద ఉన్నాయి. పార్ట్ 1 చివర్లో రణబీర్ కపూర్ తండ్రి దేవ్ బ్రహ్మాస్త్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చూపించారు. దీంతో ‘దేవ్’ అనే పవర్ ఫుల్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే ఆసక్తి రేగింది. ముందు ఈ పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తాడనే రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత రణవీర్ సింగ్ పేరు వినిపించింది. ఆ పై దేవ్ పాత్రను పోషించడానికి ‘కేజీఎఫ్’స్టార్ యష్‌ని కరణ్ జోహార్ ఎంపిక చేశాడనే రూమర్స్ వినిపించాయి. తాజాగా ఆ పాత్రను ‘లైగర్’ ఫేమ్ విజయ్ దేవరకొండ పోషించే అవకాశం ఉందనే టాక్ స్పెడ్ అయింది. ఇలా రకరకాల పేర్లు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నప్పటికీ దర్శకనిర్మాతలు మాత్రం ఎలాంటి స్పందనను తెలియచేయలేదు. నిజానికి ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా చాలా వరకూ షూటింగ్ పార్ట్ పూర్తయినట్లు సమాచారం.
Shankar- Ranveer Singh: రణ్ వీర్ సింగ్ తో శంకర్ ‘వేల్ పరి’ ట్రయాలజీ
దేవ్ పాత్రకు సంబంధించిన సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. దర్శకుడు అయాన్ ముఖర్జీ సోషల్ మీడియాలో ‘దేవ్’ పాత్రపై వస్తున్న పుకార్లపై స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడట. ఇలా కొత్త కొత్త పేర్లు వినిపించినపుడు దేవ్ పాత్రకు సంబంధించి కొత్త కోణాన్ని ఆవిష్కరించుకుంటున్నాడట. అంతే కాదు ‘హృతిక, రణ్ వీర్, యశ్, విజయ్ ఇలా పలు రకాల పేర్లను దేవ్ పాత్రకు ముడిపెడుతున్నారు. ఇంకా ప్రభాస్ పేరు కూడా వినిపించవచ్చు. అంటే దేవ్ పాత్రను అంతగా వారు ఓన్ చేసున్నట్లు అర్థం అవుతోంది. మేమైతే దేవ్ పాత్రకోసం ఏ నటుడుని ఎంపిక చేయలేదు. చేయగానే మేమే ముందు ప్రకటిస్తాం’ అని అంటున్నాడు. దేవ్ పాత్రను ఎవరు పోషిస్తారో ఏమో కానీ ఆ పాత్ర వల్లే ఇంకా ‘బ్రహ్మాస్త్ర’ జనం నోళ్ళలో నానుతూ ఉంది. లేకుంటే దానిని ఎప్పుడో మర్చిపోయేవారు అని అంటున్నారు కొందరు. మరి అంతిమంగా దేవ్ గా ఎవరు మారతారన్నది చూడాలి.