రణ్ బీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' పార్ట్ వన్ ఓ మాదిరి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అందరి కళ్ళు పార్ట్ 2 మీద ఉన్నాయి. పార్ట్ 1 చివర్లో రణబీర్ కపూర్ తండ్రి దేవ్ బ్రహ్మాస్త్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చూపించారు. దీంతో 'దేవ్' అనే పవర్ ఫుల్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే ఆసక్తి రేగింది.