Happy Birthday Rebel Star Prabhas : ప్రభాస్ కు ఆ డైరెక్టర్ అంటే ఇష్టమట.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Happy Birthday Rebel Star Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు.. బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రభాస్. ఆ తర్వాత ‘సాహో’ అంటూ ఆడియన్స్‌ను పలకరించాడు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. రీసెంట్‌గా నటుడిగా 20 యేళ్లు పూర్తి చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ప్రభాస్ ఏ ఏ సినిమాలు చేశాడు? ఎంత క్రేజ్ సంపాదించాడు అనే విషయాలు దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్.. నేడు ప్రభాస్ పుట్టినరోజు.
ప్రభాస్ కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి, సూర్యనారాయణ రాజు దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు కాగా మొదటి సంతానంగా ప్రభోధ్ జన్మించారు. ఆ తర్వాత ప్రభాస్ కి ఒక సోదరి కూడా ఉన్నారు ఆవిడ పేరు ప్రగతి, అయితే ఈ ముగ్గురిలో ప్రభాస్ చిన్నవాడు. భీమవరంలో డిఎన్ఆర్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేశారు.
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
Read Also: Sanjay Dutt: బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్
ప్రభాస్ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ‘ఈశ్వర్’ సినిమాకు క్లాప్ కొట్టారు దివంగత కృష్ణంరాజు. ఏ ముహూర్తానా పెదనాన్న ఆశీర్వాదంతో సినీ రంగంలో ప్రవేశించాడో హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు. తర్వాత రాఘవేంద్ర సినిమాతో వచ్చినా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఆ తర్వాత శోభన్ దర్శకత్వంలో వర్షం సినిమాలో నటించాడు. సినిమాతో అటు అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టడమే కాదు.. మాస్ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు ప్రభాస్.
Read Also:Husband Killed Neighbour: భార్యభర్తల మధ్య ‘చికెన్’ గొడవ.. మధ్యలో వెళ్లిన వ్యక్తి హత్య
20ఏళ్ల కెరీర్‌లో పందొమ్మిది సినిమాలు చేసిన రెబల్ స్టార్ ప్రభాస్. ఒక పక్క మిస్టర్ ఫర్ఫెక్ట్‌గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తూనే.. మరో పక్క మిర్చిలా రికార్డుల ఘాటును పెంచారు. రెబల్ స్టార్ ప్రతి సినిమాకు ఫ్రెష్ లుక్‌లో కనిపించడానికి ప్రయత్నిస్తాడు. ఒక రకంగా మంచి హిట్స్ లో ఉండగా రాజమౌళి చెప్పిన బాహుబలి కథ విని దాదాపుగా ఆ కథ కోసం రెండు మూడు ఏళ్లు వెచ్చించారు ప్రభాస్. అలా సుమారు 600 రోజులు బాహుబలి షూటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సీక్వెల్ కోసం మరో రెండేళ్లు వెచ్చించడంతో ఇలా తన కెరియర్లో దాదాపు ఐదేళ్లు కేవలం బాహుబలి కోసమే వెచ్చించారు. రాజమౌళి దర్శకత్వంలో మొత్తం మూడు సినిమాలు చేశారు ప్రభాస్.
ప్రభాస్ ఒక బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో కూడా కనిపించిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రభాస్ వ్యాక్స్ స్టాట్యూ థాయిలాండ్ లోని మేడం టుస్సాడ్స్ వ్యాక్స్ స్టాట్యూ మ్యూజియంలో ఉంది, ఆ ఘనత సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా ప్రభాస్ నిలిచారు.
Read Also:GSLV MK-3 : ఇస్రో ఖాతాలో మరో విజయం.. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం సక్సెస్
రాజమౌళి కాకుండా బాలీవుడ్ లో ఆయనకు నచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే రాజ్కుమార్ హిరాణి. ప్రభాస్ ఆయన చేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్ లాంటి సినిమాలు 20 సార్లకు పైగా చూశారట. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే చివరిగా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టారు. అందులో నాగాశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ వంటి సినిమాలు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక అనౌన్స్ చేయకుండానే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!