NTV Telugu Site icon

Taj Mahal: షాజహాన్, ముంతాజ్ సమాధులపై గంగాజలాన్ని చల్లిన యువకులు..వీడియో వైరల్

Taj Mahal

Taj Mahal

హిందూ మహాసభ మధురకు చెందిన ఇద్దరు యువకులు ఆగ్రాలోని తాజ్ మహల్‌కు చేరుకుని షాజహాన్, ముంతాజ్ సమాధులపై గంగాజలాన్ని సమర్పించారు. దీంతో అక్కడ మోహరించిన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు యువకులిద్దరినీ అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. సీఐఎస్ఎఫ్ వారిని తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు పంపింది. అక్కడ ఫిర్యాదు స్వీకరించేందుకు వేచి ఉన్నారు.

READ MORE: TG High Court Serious: కుక్కలను పునరావాస కేంద్రాలకు పంపండి..

ఓ జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. హిందూ మహాసభ మధుర జిల్లా అధ్యక్షుడు వినేష్ చౌదరి, శ్యామ్‌లు తాజ్‌మహల్‌లోకి ప్రవేశించేందుకు ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత పడమటి ద్వారం గుండా లోపలికి వెళ్లారు. యువకులిద్దరూ వాటర్ బాటిళ్లలో గంగా జలం తీసుకెళ్లారు. సమాధి దగ్గరకు రాగానే బాటిల్ లోని గంగా జలాన్ని సమాధులపై పోశారు. అది చూసిన సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు వారిని పట్టుకున్నారు.

READ MORE:Bunny Vasu: ఏ బ్లేడు ఎప్పుడు కోస్తుందో తెలీదు.. మెగా-అల్లు వివాదంపై బన్నీ వాసు కీలక వ్యాఖలు

వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు వచ్చినా కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్ తాజ్‌గంజ్ జస్వీర్ సింగ్ చెప్పారు. తాజ్ మహాల్ లోపల సీఐఎస్ఎఫ్ లేదా తాజ్ భద్రత కోసం మోహరించిన పోలీసులు ఫిర్యాదు దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

Show comments