TV Remote : మందు బాబులు తాగితే ఏం చేస్తారో కూడా వారికి అర్ధం కాదు. చుక్క పడిందంటే చాలు చుక్కల లోకంలో విహరిస్తుంటారు. ఫుల్ కొట్టితే తనంతటోడు లేదన్నట్లు ప్రవర్తిస్తారు. ఇలా చేసి తను ఇబ్బందులకు గురవుతూ ఇతరులను కష్టపెడుతుంటారు. అలా ఫుల్ కొట్టి ప్రాణాల పైకి తెచ్చుకున్నాడో యువకుడు. టీవీ రిమోటును మలద్వారంలో పెట్టుకుని ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో టీవీ రిమోట్‌ను మలద్వారంలో పెట్టుకున్న వ్యక్తికి అనంతపురం సర్వజనాస్పత్రిలోని డాక్టర్లు ఆపరేషన్ లేకుండా సురక్షితంగా బయటకు తీశారు.
Read Also:Subhash Maharia: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా!
ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్ మీడియాకు ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి చెందిన యువకుడు గురువారం సాయంత్రం ఫుల్‌గా తాగి మద్యం మత్తులో అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చాడు. మలద్వారం వద్ద నొప్పిగా ఉందని తెలపడంతో వైద్యులు పరిశీలించారు. ఆ ప్రదేశంలో టీవీ రిమోట్‌లోని కొంత భాగం కనిపించింది. లాగితే బయటకు రాలేదు. ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ రామస్వామినాయక్ ఆదేశాల మేరకు బాధితున్ని అడ్మిట్ చేసుకుని.. సర్జన్ రష్మి, పీజీ వైద్యురాలు లీలా మౌనిక, డాక్టర్ దివ్య, అనస్తీషియా వైద్యులు డాక్టర్ మురళీ ప్రభాకర్, డాక్టర్ హరికృష్ణ, స్టాఫ్‌నర్సు నాగలక్ష్మి బృందం మత్తు మందు ఇచ్చి గంటపాటు శ్రమకోర్చి సర్జరీ చేయకుండానే చేతితోనే రిమోట్‌ను బయటకు తీశారు. వైద్య బృందాన్ని ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు.
Read Also:South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో మే 21న 17 రైళ్లు రద్దు.. ప్రటించిన దక్షిణ మధ్య రైల్వే