Site icon NTV Telugu

Vizag Crime: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతి తల్లిపై కత్తితో దాడి

Attack

Attack

Vizag Crime: విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లిలోని రాంబిల్లిలో ప్రేమపేరుతో బాలికను చిత్రవధ చేసి హత్య చేసి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటనను మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. విశాఖ న్యూపోర్ట్‌ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి కత్తిదూశాడు. వుడా కాలనీ సమీపంలో నివసించే శ్యామల అనే అమ్మాయిని సిద్దూ అనే యువకుడు గత కొంతకాలం ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గతంలో కూడా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో ఆ యువతి తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు మైనర్‌ కావడంతో గాజువాక పోలీసులు పోక్సోచట్టం కింద ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.

Read Also: Lover Kills Family: ప్రేమోన్మాది ఘాతుకం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్ల హత్య..

అయితే జైలు నుంచి బయటకు వచ్చిన సిద్దూ.. శ్యామలపై కక్ష గట్టాడు. మంగళవారం ఆమెను హత్య చేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన యువతి శ్యామల తల్లి సావిత్రిపై కత్తితో దాడి చేయడంతో ఆమెకు గాయాలు అయ్యాయి. తల్లీ కూతుళ్లు గట్టిగాకేకలు వేయడంతో నిందితుడు సిద్దూ అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు పరారీలో ఉండటంతో న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు.

 

Exit mobile version