Cyber Fraud: జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్‌లో ఫోటోను అప్లోడ్ చేసిన యువకుడు.. అకౌంట్ నుంచి రూ.70 వేలు మాయం
- జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్‌లో ఫోటోను అప్లోడ్ చేసిన యువకుడు
- అకౌంట్ నుంచి రూ.70 వేలు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బురిడీ కొట్టిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని సంబరపడిపోతున్నారు. 3డీ ప్రింట్, నానో బనాన ఇలా రకరకాలుగా ఫోటోలను ఎడిట్ చేస్తుంది జెమినీ ఏఐ. అయితే జెమినీ ఏఐ ట్రెండింగ్ ఫోటో ఎడిట్ యాప్‌తో యువకుడికి రూ.70 వేల నష్టం వాటిల్లింది. ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ ఫోటో ఎడిట్ యాప్‌తో ఓ యువకుడు కష్టార్జిత డబ్బును కోల్పోయిన సంఘటన సంచలనం రేపింది.
Also Read
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల “జెమినీ” అనే ఫోటో ఎడిట్ యాప్‌లో తన ఫోటోను అప్లోడ్ చేశాడు. కొద్దిసేపటికే అకౌంట్ నుంచి రూ.70 వేల రూపాయలు మాయం కావడంతో షాక్‌కు గురయ్యాడు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!