Site icon NTV Telugu

Love: ప్రేమ మత్తులో.. తల్లిదండ్రులను వదిలి ప్రియుడితో కలిసి జీవించడానికి పోలీసులను ఆశ్రయించిన యువతి (వీడియో)

Love

Love

ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యువతీ యువకులు. ప్రేమ మత్తులో పడి కన్నవారిని సైతం విడిచి వెళ్లేందుకు వెనకాడడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు ప్రేమ పేరిట దూరమవుతుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి జీవించడానికి ఒక యువతి అన్ని హద్దులు దాటింది. ఓ తల్లి తన కూతురిని ఆపడానికి ప్రయత్నిస్తూ విలపిస్తోంది. ఆ యువతి తన కుటుంబంతో కలిసి జీవించడం కంటే తన ప్రియుడితో కలిసి జీవించాలనుకుంటున్నానని పోలీసులకు చెబుతోంది.

Also Read:Crime: వైద్యం పేరుతో మహిళపై అత్యాచారం.. నిందితుడు హిమాచల్ బీజేపీ చీఫ్ సోదరుడు..

జోధ్‌పూర్‌లోని ఓసియన్ ప్రాంతంలోని సామ్రౌ గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన హృదయ విదారకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో, ఒక తల్లి తన కుమార్తె ముందు ఏడుస్తూ వేడుకుంటున్నప్పటికీ, కుమార్తె ముఖంలో తన తల్లి పట్ల సానుభూతి కనిపించడం లేదు. ఆ అమ్మాయి తన ప్రేమికుడితో కలిసి జీవించడానికి ఇంటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంది. తల్లిదండ్రులు తమ కుమార్తెకు అన్ని సౌకర్యాలు, మంచి విద్యను అందించామని, కానీ ఇప్పుడు తమను ఎదిరించి ప్రియుడితో వెళ్లేందుకు సిద్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Also Read:Taliban: భారత పర్యటనలో మహిళల్ని దూరం పెడుతున్న తాలిబాన్ ప్రతినిధులు..

ఆ యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సబ్-డివిజనల్ ఆఫీసర్ రామ్నివాస్ మెహతా, పోలీస్ ఆఫీసర్ రాజేంద్ర చౌదరి జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విని, కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత, బాలిక భద్రత కోసం నారి నికేతన్‌కు పంపాలని నిర్ణయించారు. తల్లిదండ్రులు తమ కుమార్తెను ప్రేమతో పెంచామని, ఆమెకు ప్రతి అవసరాన్ని తీర్చామని చెబుతున్నారు. కానీ ఆమె ఇప్పుడు తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా గడపాలని కోరుకుంటోందని తెలిపారు. కూతురి ప్రవర్తనతో కుటుంబంలో మానసిక శాంతి లేకుండా పోయిందని తెలిపారు. ఈ సంఘటన సమ్రౌ గ్రామంలో చర్చకు దారితీసింది. పరిష్కారం కోసం రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version