Site icon NTV Telugu

Beer Powder: ఇంట్లోనే క్షణాల్లో బీర్ తయారు చేసుకోవచ్చు..

Beer

Beer

చాలా మంది బీర్ లు తాగేందుకు ఇష్టపడతారు. అది మంచిదని కొందరూ.. గ్లామర్ కోసమని మరికొందరూ తాగుతుంటారు. కాగా.. ఆ బీర్ లో క్రిస్పీగా సైడ్ డిష్ లు మంచింగ్ కోసం ఉండాల్సిందే. ఇక చూడు దీని సామిరంగా మందుబాబులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ కుమ్మేస్తారు. ఇక ఓ కంపెనీ మరింత ముందడుగు వేసి ఏకంగా ఇన్ స్టెంట్ బీర్ పౌడర్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇక మందుబాబులు బయటకు అడుగుపెట్టాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే గ్లాస్‌లో దర్జాగా ఐస్‌క్యూబ్స్ వేసుకుని హాయిగా బీర్‌ తాగేయొచ్చు అని జర్మన్‌ కంపెనీ అంటోంది.

Read Also: Cool Drink Fight: కూల్‌డ్రింక్ డబ్బులు అడిగిందని.. షాప్ యజమానిపై పోకిరీల దాడి

ఈ మేరకు జర్మనీకి చెందిన బ్రూవరీ కంపెనీ ఇంట్లోనే క్షణాల్లో బీర్‌ తయారు చేసుకునేలా ఇన్‌స్టింట్‌ కాఫీ లాంటి బీర్‌ పౌడర్‌ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇక ఇంట్లోనే చల్లటి బీర్ ను తయారు చేసుకుని హాట్ హాట్ స్నాక్స్‌తో ఓ పట్టుపట్టేయొచ్చు ఇక. ఇన్‌స్టెంట్‌ కాఫీ లేదా మిల్క్‌షేక్‌ లాగే ఈ బీర్ పౌడర్ తో క్షణాల్లో తయారు చేసుకోవచ్చట. ఒక గ్లాస్‌లో రెండు చెంచాల బీర్‌ పౌడర్ కి కొద్దిగా నీటిని కలిపితే చాలు.. నిమిషాల్లో మీకు కావాల్సిన బీర్ రెడీ అయిపోతుందట.

Read Also: Bigg Boss Telugu 7: కుడి ఎడమ అయితే పొరపాటు లేదోయ్ .. నాగ్ ప్రోమో వచ్చేసిందోచ్

దీంతో ఇక టన్నుల కొద్ది బీర్‌ రవాణ భారీగా తగ్గుతుందని వ్యాపార నిపుణులు అంటున్నారు. ఇక నుంచి ఒక కిలో బీర్‌ రవాణకు బదులు కేవలం 45 గ్రాముల పౌడర్‌కి పరిమితం చేయొచ్చు అని వారు తెలిపారు. అదే సమయంలో బీర్‌తో స్నానం చేయాలనుకునే వారి కోసం బాత్‌ బీర్‌ను కూడా రూపొందిస్తున్నాట్లు సదరు కంపెనీ పేర్కొనింది. ప్రస్తుతానికి ఆ జర్మనీ కంపెనీ 42 రకాల బీర్లను తయారు చేస్తొందని, అలాగే గ్లూటెన్-ఫ్రీ బీర్, నాన్‌ ఆల్కహాలిక్‌ బీర్‌లను సైతం రెడీ చేయునున్నట్లు సదరు జర్మనీ కంపెనీ బ్రూవరీ న్యూజెల్లర్‌ క్లోస్టర్‌ బ్రూ వెల్లడించింది.

Exit mobile version