Modi In USA: “మీరే భారత బ్రాండ్ అంబాసిడర్లు”.. ప్రవాసులపై మోడీ ప్రశంసలు..
- మీరే భారత బ్రాండ్ అంబాసిడర్లు..
- ఎన్ఆర్‌ఐలు భారత్-అమెరికా మధ్య అనుసంధానకర్తలు..
- ఏఐ అంటే అమెరికా-భారత్..
- ఈ రోజు 5జీ మార్కెట్ అమెరికా కన్నా పెద్దది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi In USA: భారతదేశానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ అమెరికాలోని ప్రవాస భారతీయులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. అమెరికాలో పర్యటిస్తున్న మోడీ ఈ రోజు న్యూయార్క్‌లోని నసావు కొలీజియంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. లాంగ్ ఐలాండ్‌లోని కొలీజయం వద్దకు ప్రధాని రాగానే ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ‘‘మోడీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’’ ఈవెంట్‌కి 14 వేల మంది ఎన్ఆర్ఐలు, సెలబ్రిటీలు, ఇండో అమెరికన్ కమ్యూనిటీ తరలించి వచ్చింది. ‘‘భారత్ మాతాకీ జై’’ అంటూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నమస్తే యూఎస్ అంటూ విష్ చేశారు.
తాను ఇక్కడికి సుదూర తీరాల నుంచి వచ్చానని, గతంలో నేను ఓ పార్టీ కార్యకర్తగా ఇక్కడికి వచ్చానని, ఏ పదవి లేనప్పుడు అమెరికాలోని 29 రాష్ట్రాలు తిరిగానని చెప్పారు. ఎన్ఆర్ఐలు భారత్ అమెరికా మధ్య అనుసంధానకర్తలుగా ఉన్నారని అన్నారు. మీరంతా మన దేశానికి ప్రతినిధులు, దూతలుగా ఉన్నారని అన్నారు. భిన్నత్వాన్ని అర్థం చేసుకుని జీవించడం మన మూలాల్లోనే ఉందని, భాషలు అనేకం భావం ఒక్కటే అని, మనం ఎక్కడికెళ్లిన ఒక కుటుంబంలా వ్యవహరిస్తామని అన్నారు.
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
Read Also: Iran: ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై పేలుడు.. 51 మంది మృతి
భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, భారత్‌లో ఎన్నికలు ముగిశాయి, ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. అమెరికా మొత్తం జనాభా కంటే భారత్‌లో రెట్టింపు ఓటర్లు ఉన్నారని, భారత ప్రజాస్వామ్యం యొక్క ఈ స్థాయిన చూసినప్పుడు మేము మరింతగా గర్వపడుతున్నామని చెప్పారు. ప్రపంచానికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, నాకు మాత్రం ఏఐ అంటే అమెరికా-ఇండియా అని అన్నారు.
ప్రపంచంలో తాను ఎక్కడి వెళ్లినా, ప్రతీ నాయకుడు ప్రవాస భారతీయులను కొనియాడుతారని, నిన్న ప్రెసిడెంట్ బైడెన్ తనను డెలావర్‌లోని అతని ఇంటికి తీసుకెళ్లారని, అతడి ఆప్యాయత నాకు హృదయానికి హత్తుకునే క్షణమని, ఆ గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు దక్కతుందని అన్నారు. ఈ రోజు భారతదేశం 5జీ మార్కెట్ అమెరికా కన్నా పెద్దదని, కేవలం రెండేళ్లలోనే ఇది సాధ్యమైందని,ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా 6జీ కోసం పనిచేస్తున్నామని అన్నారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నామని, ప్రస్తుతం ఇండియా అవకాశాలకు నిలయమని చెప్పారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!