NTV Telugu Site icon

Yogi Adityanath: బీజేపీ భవిష్యత్ విజయాలపై కీలక జోస్యం చెప్పిన యోగి

Yogi

Yogi

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ భవిష్యత్ విజయాలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు 2027, 2032లో జరిగే యూపీ ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ మెజారిటీతో వరుసగా బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. యూపీలో తమ పాలనను నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Health News: జర్వం వచ్చినప్పుడు బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వొచ్చా?

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న యోగి ఆదిత్యనాథ్ సభలో మాట్లాడుతూ.. 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితం ఇప్పటికే ఖరారైందని, 2027, 2032లో రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. మరోవైపు వ్యవసాయ ఆదాయం, కుల గణన, శాశ్వత డీజీపీని నియమించడంలో వైఫల్యంపై విధానసభలో ప్రభుత్వాన్ని విపక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష నేత అఖిలేష్ ను యోగీ హేళన చేస్తూ ..2014, 2017, 2019, 2022 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోలేదో మీ ప్రసంగం స్పష్టం చేసిందని యోగి అన్నారు.

Ram Gopal Varma: రవితేజ కోసమే భోళా శంకర్ తీసినట్లుంది.. మరో బాంబేసిన రామ్ గోపాల్ వర్మ

వెండి చెంచాతో పుట్టిన వారికి పేదలు, రైతులు, దళితుల సమస్యలు అర్థం కావని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాలను ఆదుకున్నట్లు ఎవరికీ కనిపించడం లేదని తెలిపారు. విచ్చలవిడి పశువులు పంటలను ధ్వంసం చేయడం, ప్రమాదాలకు కారణమవుతున్నాయన్న అంశంపై అఖిలేష్‌ను యోగి టార్గెట్ చేశారు. తమ హయాంలో జంతువులను కబేళాలకు ఇవ్వడంపై యాదవ్ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. ఇదే కాకుండా.. మరిన్ని అంశాలపై ప్రతిపక్ష నేత అఖిలేష్ కు సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటరిచ్చారు.