Site icon NTV Telugu

Yogandhra 2025: రికార్డులు సృష్టించేందుకు సిద్దమైన విశాఖ!

Yogandhra 2025 Vizag

Yogandhra 2025 Vizag

రికార్డులు సృష్టించేందుకు విశాఖ సన్నద్ధమైంది. యోగాంధ్ర 2025 సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొననున్నారు. మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. ప్రధానమంత్రి మోడీ సమక్షంలో విశాఖ యోగా డే డిక్లరేషన్ ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది.

మరోవైపు నగరంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది. ఎల్లుండి జరిగే ఇంటర్నేషనల్ యోగా డేకు స్నానహాకంగా ఆర్కే బీచ్‌లో వాక్ థాన్ ఉత్సాహంగా జరిగింది. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్, ఎస్ సవిత సహా ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ప్రభుత్వ కార్యదర్శి సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్, కార్యదర్శి వీరపాండ్యన్‌లు యోగాసనాలు ప్రదర్శనలో పాల్గొన్నారు. యోగాసనాలు ప్రదర్శనలో వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read: YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. సర్వత్రా ఆసక్తి!

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు రానున్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ వంటి ప్రముఖులు అంతర్జాతీయ యోగాడేలో పాల్గొనున్నారు. యోగాంధ్ర 2025 కోసం ప్రధాన వేదికగా ఆర్కే బీచ్‌ను ఎంపిక చేశారు. లక్షల మంది వేడుకల్లో పాల్గొననున్నారు. యోగా దినోత్సవం రోజు ఉదయం 5:30 గంటల నుంచి ప్రజలకు వేదిక వద్దకు అనుమతి ఉంటుంది. ప్రధాని మోడీ ఉదయం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని ప్రసంగం అనంతరం కార్యక్రమం ముగుస్తుంది.

Exit mobile version