NTV Telugu Site icon

Yoga Tips: క్రమం తప్పకుండా పది నిముషాలు ఈ యోగా ఆసనాలు చేస్తే చాలు.. అధిక కొవ్వు ఇట్టే మాయం

Yoga

Yoga

Yoga Tips: యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా శరీరంలోని అధిక కొవ్వును తగ్గించి, శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. యోగా సాధారణంగా అధిక తీవ్రత వ్యాయామం కాకపోయినా.. ఇప్పటికీ అనేక విధాలుగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇకపోతే, బరువు తగ్గాలనుకునే వారు కొన్ని యోగాసనాల సాధనను చేస్తే చాలు. అదికూడా కేవలం 10 నిమిషాల యోగా సాధన మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యోగా సాధన మీ బరువును నియంత్రించడమే కాకుండా.. మిమ్మల్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. మరి బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం, ప్రభావవంతమైన యోగా ఆసనాలు ఏంటో చూద్దాం.

Also Read: Komuravelli Mallanna Jatara 2025: నేటి నుంచి కొమురవెళ్లి మల్లన్న జాతర..

త్రికోనాసనం:

మీరు పొట్ట, నడుము ఇంకా తొడల కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే, త్రికోణాసనం సాధన చేయండి. ఇది శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చడంతో పాటు బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. ఈ ఆసనాన్ని అభ్యసించడానికి, కాళ్ల మధ్య కొంత దూరం ఉంచి నిలబడండి. ఇప్పుడు కుడి చేతిని కుడి కాలు వైపుకు వంచి ఎడమ చేతిని పైకి లేపాలి. అదే సమయంలో, ముఖాన్ని పైకి ఉంచండి. ఈ భంగిమలో కొన్ని సెకన్ల పాటు ఉండి మరొక వైపు పునరావృతం చేయండి.

సూర్య నమస్కారం:

సూర్య నమస్కారం అనేది 12 ఆసనాల సమితి. దీని అభ్యాసం మొత్తం శరీరంలోని కండరాలను సక్రియం చేస్తుంది. ఇక ఈ ఆసనాన్ని అభ్యసించడానికి, నిటారుగా నిలబడి నమస్కార భంగిమలో చేతులు కలపండి. ఆ తర్వాత శ్వాస తీసుకుంటూ చేతులను పైకెత్తి వెనుకకు వంచాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ, ముందుకు వంగి నేలను తాకడానికి ప్రయత్నించండి. మీ కాళ్లను వెనక్కి తీసుకొని ప్లాంక్ భంగిమలోకి ఉండాలి. మీ ఛాతీ, కడుపుతో నెమ్మదిగా నేలపై పడుకోండి. నాగుపాము భంగిమలో పైకి లేచి, ఆపై పర్వత భంగిమలోకి వంగండి. ఆపై మీ పాదాలతో ముందుకు నిలబడండి.

Also Read: Komuravelli Mallanna Jatara 2025: నేటి నుంచి కొమురవెళ్లి మల్లన్న జాతర..

వీరభద్రాసనం:

ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట, తొడల కొవ్వు తగ్గుతుంది. అలాగే విరాభద్రాసనం శరీర బలాన్ని, సమతుల్యతను పెంచుతుంది. విరాభద్రాసనాన్ని అభ్యసించడానికి, నిటారుగా నిలబడి ఒక కాలు ముందుకు మరొక కాలును వెనుకకు ఉంచండి. ఇప్పుడు మీ మోకాళ్లను వంచి, మీ రెండు చేతులను పైకెత్తి, మీ నడుమును స్థిరంగా ఉంచండి. 30 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి. ఆ తర్వాత దానిని పునరావృతం చేయండి.