Best Yoga Poses: ప్రతి స్త్రీ తన శరీర ఆకృతి ఎల్లప్పుడూ మంచి షేప్‌లో ఉండాలని కోరుకుంటుంది. కానీ, నేటి అస్తవ్యస్తమైన జీవనశైలి, వర్కవుట్ లేకపోవడం వల్ల చాలా మంది స్త్రీల శరీర ఆకృతి కోల్పోతున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇకపోతే ఆడవారు ఎదురుకొనే సమస్యలలో ఒకటి వారి రొమ్ము పరిమాణం చిన్నగా ఉండడం. పెద్ద రొమ్ము పరిమాణం స్త్రీ శరీరాన్ని ఆకర్షణీయంగా మార్చడమే కాకుండా ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఈ రోజుల్లో రొమ్ము పరిమాణాన్ని పెంచడానికి నూనెలు, ఆయింట్‌మెంట్లు, పలు రకాల కప్పులు, సర్జరీలు వంటి అనేక ఉత్పత్తులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మీకు కాస్త పెద్ద రొమ్ములను పొందడానికి సహాయపడతాయి. అయితే, బ్రెస్ట్ సైజును పెంచుకోవడానికి చాలా సహజమైన మార్గాలు ఉన్నాయని మీకు తెలుసా? అందులో ఒకటి యోగా. అవును, కొన్ని యోగా భంగిమలు కొవ్వు, గ్రంధి కణజాలాలను పెంచడం ద్వారా స్త్రీ రొమ్ము పరిమాణాన్ని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాదు, ఈ యోగా ఆసనాలు రొమ్ములకు మద్దతు ఇచ్చే కండరాలను సరి చేసి బలోపేతం చేస్తాయి. సహజమైన రీతిలో రొమ్ము పరిమాణాన్ని పెంచడంలో సహాయపడే అటువంటి రెండు యోగా ఆసనాలను తెలుసుకుందాం.
Also Read: Global Pandemic: కరోనా తర్వాత ప్రపంచాన్ని కలవరపెట్టే ‘‘మహమ్మారి’’ ఇదేనా..?
హస్త ఉత్తనాసనం:
హస్త ఉత్తనాసనం చేయడం వల్ల రొమ్ము పరిమాణంలో మార్పు వస్తుంది. అంతేకాదు శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది. ఈ ఆసనం వెన్నెముక, భుజాలను బలపరచడమే కాకుండా మానసిక వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఈ ఆసనాన్ని చేయడానికి ముందుగా నిలబడి, మీ రెండు చేతులను పైకెత్తుతూ శ్వాస పీల్చుకోండి. మీ తలను చేతుల మధ్య ఉంచి నెమ్మదిగా వెనుకకు వంచండి. ఇప్పుడు శ్వాస వదులుతూ నెమ్మదిగా పీల్చాలి. వెనుకకు వంగి ఉన్నప్పుడు మీ కళ్ళు తెరిచి ఉంచి కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంది ఆపై పాత భంగిమకు తిరిగి రండి.
Also Read: Moto g35 5G: 10 వేల కంటే తక్కువ ధరలో చౌకైన ఫోన్ ను తీసుకొచ్చేస్తున్న మోటోరోలా
చక్రాసనం:
చక్రాసనం చేయడం ద్వారా రొమ్ముల దగ్గర సాగిన స్ట్రెచ్ కాబడి అక్కడి కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల శరీరంలోని పై భాగంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది టోనింగ్‌లో సహాయపడుతుంది. చక్రాసనం చేయడానికి, ముందుగా మీ వెనుకభాగంలో పడుకుని, మీ కాళ్ళను మోకాళ్ల వద్ద వంచి, పాదాలు నేలపై గట్టిగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు అరచేతులను ఆకాశం వైపు ఉంచి మోచేతుల వద్ద చేతులు వంచండి. ఇప్పుడు భుజాల నుండి చేతులను తిప్పండి. అలాగే అరచేతులను తలకు ఇరువైపులా నేలపై ఉంచండి. శ్వాస పీల్చేటప్పుడు అరచేతులు, పాదాలపై ఒత్తిడిని వర్తింపజేస్తూ మొత్తం శరీరాన్ని పైకి అనండి. మీ భుజాలకు సమాంతరంగా మీ కాళ్ళను తెరవండి. అలా చేసిన తర్వాత కొంత సమయం పాటు ఈ భంగిమలో ఉండండి.