IPL 2023: ఐపీఎల్-2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రజత్ పాటిదార్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇది బెంగళూరు జట్టుకు పెద్ద దెబ్బే. 29 ఏళ్ల రజత్ గతేడాది ఎనిమిది మ్యాచ్‌లలో 55.50 సగటుతో 333 పరుగులతో మూడో అత్యధిక స్కోరర్‌గా ఉన్నాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. అతను గతేడాది క్వాలిఫయర్ 1లో ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని కొట్టాడు. ఇప్పటికే ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ దూరం కాగా.. ఇప్పుడు రజత్ పాటిదార్ ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
Read Also: DC vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ”దురదృష్టవశాత్తూ కాలి మడమ గాయం కారణంగా రజత్ పాటిదార్ ఐపీఎల్-2023 నుంచి తప్పుకున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. రజత్‌కు మేము ఎల్లప్పుడూ మద్దతునిస్తూనే ఉంటాము. ఇక పాటిదార్ స్థానంలో ఎవరని తీసుకోవాలన్నది కోచ్, మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయించలేదు అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. కాగా గతేడాది జరిగిన మెగావేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పాటిదార్‌ను అనూహ్యంగా ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. అయితే తనకు వచ్చి అవకాశాన్ని పాటిదార్ అందిపుచ్చుకున్నాడు. గతేడాది ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై అద్భుతమైన సెంచరీ బాదాడు. ఇక, ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. తమ తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.