Site icon NTV Telugu

CM YS Jagan: ఐదేళ్ల క్రితం ఇదే రోజున అధికారంలోకి వచ్చాం.. సీఎం జగన్‌ ఆసక్తికర ట్వీట్!

Cm Jagan

Cm Jagan

CM YS Jagan: ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2029 మే 30న వేలాది మంది అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. మే 30న సరిగ్గా మధ్యాహ్నం 12.23 గంటలకు వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించిన జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దాదాపు 40 వేల మందికిపైగా ప్రజలు హాజరయ్యారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణం చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.

Read Also: Andhra Pradesh: జూన్‌ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను హ్యాండోవర్ చేసుకోనున్న జీఏడీ..

“దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.” అని సీఎం జగన్‌ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

 

Exit mobile version