NTV Telugu Site icon

Vijaysai Reddy: అరెస్టుకు భయపడేది లేదు.. సీఎం చంద్రబాబు ఏం చేసుకున్నా నేను సిద్దం!

Vijaysai Reddy Ycp

Vijaysai Reddy Ycp

అరెస్టుకు భయపడేది లేదని, సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేసుకున్నా తాను సిద్దం అని వైసీపీ పక్ష నేత విజయసాయి రెడ్డి తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అదానీతో సత్సంబంధాలు ఉన్నాయిని, తమపై ఎలాంటి ఒత్తిడులు లేవన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి అత్యంత పరిపాలన దక్షుడని, రాష్ట్రంలో తాము ఇచ్చినంత జనరంజకమైన సంక్షేమ పాలన ఎవరూ ఇవ్వలేరన్నారు. సీఎం చంద్రబాబుకు లంచమిచ్చి కేవీ రావు కాకినాడ పోర్టును తీసుకున్నారు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ పోర్టు అంశంలో టీడీపీ నేతలు తన పేరును కూడా తీసుకురావడం, తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం పట్ల విజయసాయి రెడ్డి మండిపడుతున్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘1997లో ఏడీబీ (ఏలియన్ డెవలప్మెంట్ బ్యాంకు) నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్టును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ రంగం సంస్థగా పోర్టును అభివృద్ధి చేసి.. సీఎం చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారు. 1997 నుంచి దర్యాప్తు చేస్తే బాగుంటుంది. కేవీ రావు ఓ బ్రోకర్. నాలుగున్నరేళ్లుగా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు. కేవీ రావును చిన్న వయసున్న విక్రాంత్ రెడ్డి బెదిరించారట. కేవీ రావు సంవత్సరంలో నాలుగు నెలలే ఇండియాలో ఉంటారు. సింగపూర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా బ్రోకర్ పనులు చేసే వ్యక్తి ఆయన. కేవీ రావు ఓ కులవాది. కినాడ పోర్టును మలేషియా ప్రధానమంత్రి మహాతిర్ మహమ్మద్ తనయుడు కొంటున్నారని గతంలో చంద్రబాబు చెప్పారు. ఆ ముసుగులో కేవీ రావుకు పోర్టు కట్టబెట్టారు. ఈ విషయంపై చంద్రబాబు జేబు సంస్థ సీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలి’ అని విజయసాయి రెడ్డి కోరారు.

‘చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటి. 2020లో కేవీ రావుకు నేను ఫోన్ చేశానని, కాకినాడ పోర్టుపై విక్రాంత్ రెడ్డితో మాట్లాడానని చెప్పడానికి ఆధారాలున్నాయా?. కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబుకు చెంచా, రాజకీయ తొత్తు. దొడ్డిదారిన కేవీ రావును చైర్మన్ గా ప్రవేశపెట్టారు. కాకినాడ పోర్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం కేవీ రావు తీసుకుంటున్నదే. మాపై చేస్తున్న ఆరోపణలు నిరాధారం. తక్కువ రేటుకి భూమి అందుబాటులో ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. అందుకే కాకినాడ ఎస్సిజెడ్ ప్రారంభించాం. మేము అధికారంలో ఉన్నప్పుడు అదానీతో సత్సంబంధాలు ఉన్నాయి. మాపై ఎలాంటి ఒత్తిడులు లేవు, తీసుకురాలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అదానీ తోడ్పడ్డారు. చంద్రబాబుకు లంచమిచ్చి కేవీ రావు కాకినాడ పోర్టును తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వానికి రావాల్సిన లాభాలను రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ముందస్తు బెయిల్ కు కూడా దరఖాస్తు చేసుకోను. అరెస్టుకు భయపడేది లేదు. చంద్రబాబు ఏం చేసుకున్నా నేను సిద్దం’ అని విజయసాయి రెడ్డి చెప్పారు.

Show comments