NTV Telugu Site icon

MP Sri Krishna Devarayalu: చంద్రబాబుతో వైసీపీ ఎంపీ భేటీ..

Mp Sri Krishna Devarayalu

Mp Sri Krishna Devarayalu

MP Sri Krishna Devarayalu: ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు ఈ మధ్యే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు.. హస్తిన చేరుకున్న చంద్రబాబు.. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు నివాసంలో.. పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబును కలిసేందుకు వచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయులు.. నర్సరావుపేట నుంచి మరోసారి లావుకు సీటు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించిన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు ఎంపీ లావు.. ఇక, ఆయన చూపు టీడీపీ వైపు అనే ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, బీజేపీతో పొత్తుల విషయాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఈ సారి టీడీపీ నుంచి ఆయన బరిలోకి దిగుతారనే చర్చ సాగుతోంది.

Read Also: Hamas: కాల్పులపై హమాస్ కొత్త ప్రతిపాదన! వర్క్‌వుట్ అయితే మాత్రం..!

కాగా, వైసీపీకి షాక్‌ ఇస్తూ.. ఈ మధ్యే నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పల్నాడు ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని.. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేసుకున్న ఆయన.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశానని.. కొంతకాలంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్న విషయం విదితమే.. అయితే, కొన్నిరోజులుగా ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారనే చర్చ జోరుగా సాగింది.. దానికి అనుగుణంగా ఈ రోజు ఢిల్లీలో చంద్రబాబుతో సమావేశం అయ్యారు శ్రీ కృష్ణదేవరాయలు.

Read Also: Boyapati Srinu: బన్నీతో అనుకుంటే బాలయ్యతోనే సెట్ చేశావా?

మరోవైపు.. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వెలసిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు ఫ్లెక్సీలు వెలిశాయి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆయన రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. టీడీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.. ఢిల్లీలో చంద్రబాబును ఎంపీ కలవగా.. అదే సమయంలో పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటు అయ్యాయి.. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులు.. అయితే, లావు శ్రీ కృష్ణదేవరాయలకు టీడీపీ ఏ సీటు కేటాయిస్తుంది అనేది తేలాల్సి ఉంది.