Site icon NTV Telugu

MLA Chandrasekhar: మీ హయాంలో మీ నాయకుడి సినిమానే వాయిదా వేసుకునే పరిస్థితి..

Tatiparthi Chandrasekhar

Tatiparthi Chandrasekhar

ఎన్నికల ముందు 143 వాగ్దానాలతో పాటు ఈవీఎంలను లోబర్చుకుని చంద్రబాబు గెలిచారని, గెలిచి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం రోజు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పైకి వచ్చారని చెప్పారు. ప్రతి కార్యక్రమంలో జగన్‌ని నిందిస్తున్నారని.. అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని.. దిగజారుడు మాటలు మాట్లాడటానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దళితులకు ఈ రాష్ట్రంలో అవమానం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది టీడీపీ వాళ్లే అని గంటా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారన్నారు.. హోం మంత్రి అనితకు కులం కోటా లోనే మంత్రి పదవి వచ్చిందని విమర్శించారు. దళితులను కొడితే హోం మంత్రి కేర్ లెస్ గా మాట్లాడుతున్నారన్నారు.. పరిటాల సునీత ఇలాకాలో దళిత బాలిక పై నెలల తరబడి అత్యాచారం చేశారని గుర్తు చేశారు. ఈ ఘటన మీకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు.

READ MORE: Khairatabad Ganesh : ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా ఖైరతాబాద్ గణేషుడు.. ఎన్ని అడుగులంటే..?

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ప్రశ్నించారు. “ఇచ్చిన హామీలను అమలు చేయని మీరు వెన్నుపోటు దారులు కాదా? విద్యార్థులు, మహిళలు, తల్లులను మోసం చేసింది మీరు కాదా? రైతులను మోసం చేసింది నిజం కాదా? మీ నాయకుడు కూడా సినిమా వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడింది.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖలో ఒక్కరికి ఉద్యోగం ఇప్పించారా? పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కి ఉద్యోగం ఇప్పించారు. పంచాయతీ రాజ్ శాఖని నిర్వీర్యం చేస్తున్నారు.” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

READ MORE: CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రికి హత్య బెదిరింపులు.. నిందితుడి కోసం గాలింపు..

Exit mobile version