NTV Telugu Site icon

MLA Prasannakumar Reddy: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు..

Prasannakumar Reddy

Prasannakumar Reddy

MLA Prasannakumar Reddy: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాడే తప్ప ఎప్పుడు కూడా సింగిల్‌గా వచ్చింది లేదన్నారు. సింహం సింహమే.. జగన్మోహన్ రెడ్డి పేరు చెపితే సింహం గుర్తుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎవరితో పొత్తులు లేకుండా సింగిల్‌గా వస్తాడని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య ఉంటాడు.. ప్రజలం కష్ట సుఖాలు తెలుసుకుంటాడన్నారు. ఎన్నికల్లో పోరాడాలంటే ఏకపక్షంగా ఒంటరిగా రావాలన్నారు.

Read Also: Yogi Government: 5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం

రకరకాల పొత్తులతో ప్రజల్లోకి వచ్చి గెలవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు సంగతి తెలిసిందేనని.. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవటం వాళ్లకు విడాకులు ఇవ్వటం.. మళ్లీ కొత్త సంబంధం కోసం ఎదురు చూడటమంటూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, సీపీఎం, సీపీఐలతో కాపురం చేశాడని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటపడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకుని పవన్ కళ్యాణ్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉద్దేశంతో నానా అవస్థలు పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.