మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై తీవ్ర స్దాయిలో విమర్శలు చేశారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. తనకు తెలియకుండా సత్యవేడు నేతలతో సమావేశం పెట్టడం, కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే నగరి తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజక వర్గ నేతలతో సమావేశాన్ని ఆయన ఇంటిలో పెట్టాగలరా అని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి రిజర్వడ్ నియోజకవర్గాలంటే అంతా చిన్నచూపా అని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కంటే సీనియర్ లీడర్ తానని.. తనలా సర్పంచ్ గా గెలిచాడా.. ఎంపీటీసీ, ఎంపీపీగా చేశానని తెలిపారు. ఎంతోమంది సీఎంలను చూశానని ఆదిమూలం పేర్కొన్నారు.
Read Also: Bihar Politics: నితీష్ వైఖరిపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు
పెద్దిరెడ్డి కుట్రలు చేసి తనకు ఎమ్మెల్యే సీటు లేకుండా చేశాడని దుయ్యబట్టారు. సంపాదించుకుంది మీరు…దోచుకుంది మీరు.. ఇప్పుడు నిందలు నాపై వేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. నన్ను ఎందుకు ఎమ్మెల్యే నుండి ఎంపీగా పంపిస్తున్నారని జగన్ ను ప్రశ్నించానన్నారు. ఇసుక, గ్రావెల్ దోచుకుంటున్న దొంగలే నాపై దొంగ రిపోర్టు ఇచ్చారని సీఎం జగన్ కే చెప్పానన్నారు. నిజాలు చెప్పాక రెండు నెలలుగా తనను మానసికంగా హింసించారని తెలిపారు. సత్యవేడు ప్రజలు తనతోనే ఉన్నారని చెప్పుకోచ్చారు ఆదిమూలం. కాగా.. ఆదిమూలం ఆరోపణలు జిల్లా వైసీపీలో సంచలనంగా మారింది.
Read Also: Minister Peddireddy: చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్