NTV Telugu Site icon

Ravindranath Reddy: కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు లేదు.. అభివృద్ధి అంతకంటే లేదు!

Ravindranath Reddy

Ravindranath Reddy

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యిందని.. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో తమ ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాటలు చెప్తున్నారు తప్ప వాస్తవ రూపం లేదని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.

రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ… ‘కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యింది. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు లేదు, అభివృద్ధి అంతకంటే లేదు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు, పాలన అనేదే లేకుండా పోయింది. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందించాం. ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదు. ఎరువులు, విత్తనాలు ఇచ్చే దిక్కు లేదు. ఈ తుఫానుకు వరి తీవ్రంగా నష్టపోయింది. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేదు. వరి కొనుగోలు లేదు, ఇక రంగు మారిన ధాన్యం కొనుగోలుకు దిక్కే లేదు. సీఎం చంద్రబాబు నుంచి అందరూ మాటలు చెప్తున్నారు తప్ప వాస్తవ రూపం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ అధికారులే ఉండటం లేదు’ అని అన్నారు.

‘కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం అంటూ చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ డైవర్షన్ చేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుపై గ్యారెంటీ కాదు.. వీర బాదుడుకు గ్యారెంటీ. బియ్యం నుంచి కూరగాయల వరకూ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో బాబు బాదుడే బాదుడు అన్నాడు, ఇప్పుడు వీర బాదుడు బాదుతున్నాడు. ప్రజలంతా ఇప్పుడు ఇదేం ఖర్మరా బాబూ అంటున్నారు. ప్రతి మీటింగులో విద్యుత్ చార్జీలు పెంచేది లేదు అని ఊదరగొట్టాడు. ఈ ఐదారు నెలల్లోనే రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఇప్పుడు కరెంట్ బిల్లు పట్టుకుంటే.. షాక్ కొట్టే పరిస్థితి వచ్చింది. స్థానిక కూటమి నేతలు కూడా ఎక్కడికక్కడ లోకల్ టాక్స్ తో వీర బాదుడు మొదలుపెట్టారు. బెల్టు పెడితే మీకు బెల్టు తీసేస్తా అన్నాడు. హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే బెల్టు షాపులను వేలం వేసుకున్నారు. 90 శాతం మద్యం షాపులన్నీ వారే కైవసం చేసుకున్నారు. వీళ్లంతా ప్రజల డబ్బు ఎలా దోచుకుంటుందో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చింది దోచుకోవడానికే. చేసేదంతా వారు చేసి ఇదంతా జగన్ గారి వల్లే అంటూ పచ్చ పత్రికల్లో రాతలు రాయిస్తున్నాడు. ఈ ఫెయింజల్ తూఫాన్ కూడా జగన్ వల్లే వచ్చింది అన్నా అంటారు. మరోవైపు బాబు 30 ఏళ్లు అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ అంటాడు. సీజ్ చేసిన షిప్ నాకు చూపించలేదు అంటూ పవన్ రాద్ధాంతం చేస్తున్నారు. అసలు పవన్ అధికారంలో ఉండి మాట్లాడుతున్నారా?, డ్రామా చేస్తున్నారా?. బూడిద డబ్బులు పంచుకునేందుకు చంద్రబాబు నేరుగా పంచాయతీలు చేయడం సిగ్గుచేటు. ఇలాంటి పరిపాలనను ప్రజలు ఊహించి ఉండరు. రోడ్లపై టోల్ టాక్స్ అంటున్నాడు, ప్రజలతో వ్యాపారం చేస్తావా?. అందుకే ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు. ఫ్రీ బస్సు ఆగస్టులో ప్రారంభం అన్నారు దీపావళి పోయింది.. ఇప్పుడు నేరుగా బంగాళాఖాతంలోకి వెళ్ళినట్లుంది’ అని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.