NTV Telugu Site icon

YCP: చంద్రబాబు స్కిప్ట్ ను మోడీ చదివారు.. ప్రధాని వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్

Gudivada Amarnath

Gudivada Amarnath

ప్రధాని మోడీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండుచోట్ల నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొ్న్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి మద్ధతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా.. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్ ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై మోడీ, చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు బాబే యూ టర్న్ అనుకుంటే ఇప్పుడు మోడీ అదే చేశారని ఆరోపించారు. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోడీ చేరి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం అన్యాయమని పేర్కొన్నారు.

Exam Marks: ఇదేందయ్యా ఇది.. పరీక్షలో 200కు 212 మార్కులు సాధించిన విద్యార్థి.. ఎక్కడంటే..

చంద్రబాబు స్కిప్ట్ ను ప్రధాని మోడీ చదివారని ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇన్నాళ్ళు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు.. ఇప్పుడు మోడీ కూడా యుటర్న్ తీసుకున్నారని తెలిపారు. రాజకీయ అవసరాల కోసం విమర్శలు చేస్తున్నారని.. స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్, రాష్ట్రానికి రావల్సిన నిధులు గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రధాని చెబితే.. తాను పోటీ నుంచి తప్పుకుంటా అని చెప్పాను.. అది జరగలేదన్నారు. కేవలం ఓట్లు సీట్లు కోసమే ఈ సభ జరిగిందన్నారు. ప్రభుత్వం పై విమర్శలు చేస్తే బీజేపీ ఓట్లు పడతాయి అనుకుంటుంది.. రేపు గాజువాకలో సీఎం జగన్ ప్రచార సభ ఉంది.. అక్కడ అన్నింటికి సీఎం జగన్ సమాధానం చెబుతారన్నారు.

Child Marriage: 13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల వృద్ధుడితో పెళ్లి.. ఎక్కడంటే..?