NTV Telugu Site icon

YCP- TDP Rebel MLAs: టీడీపీ- వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. ఈసారి రాకపోతే

Rebal

Rebal

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ మరో కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. వైసీపీ- టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారం నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు పార్టీల రెబల్ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విచారణకు రావాల్సిందిగా ఇవాళ అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌లు నోటీసులు ఇచ్చారు. ఇదే ఫైనల్ విచారణ నోటీసులని తెలిపింది.. హాజరుకాకుంటే అనర్హతపై తుది నిర్ణయం తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: TSRTC MD Sajjanar: మేడారం భక్తులకు బిగ్ షాక్.. బస్సుల్లో కోళ్లు , గొర్రెలకు ప్రవేశం లేదన్నసజ్జనార్

అలాగే, ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తమకు వివరణ ఇవ్వాలని స్పీకర్ తెలిపారు. అలాగే, మూడు గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాలని పేర్కొనింది. ఇక, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆనం రామనారాయణరెడ్డికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. సాయంత్రం 4గంటలకు విచారణ ఉంటుంది.. రాకపోతే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పీకర్‌ తమ్మినేని సీతారం స్పష్టం చేశారు. కానీ, ఆనంతో సహా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తాము ఈ రోజు విచారణకు హాజరు కావడం లేదని స్పీకర్ కు సమాధానం ఇస్తూ లేఖ రాశారు.

Read Also: Operation Valentine: వరుణ్ తేజ్ కోసం రంగంలోకి సల్మాన్ ఖాన్, రామ్ చరణ్!

అయితే, వైసీపీ, టీడీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు ఉండగా.. అలాగే మండలిలోనూ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణలు ఉండగా.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌ లపై కూడా తెలుగుదేశం పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.
TDP, YCP రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ల పై నేడు స్పీకర్ విచారణ | Ntv