Yash 19 : కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియా స్టార్‌గా మారిన కన్నడ స్టార్ హీరో యష్ ఇప్పటివరకు తన తర్వాత చిత్రాన్ని ప్రకటించలేదు. కన్నడ పరిశ్రమలో రాకింగ్ స్టార్‌గా గుర్తింపు పొందిన యష్ ప్రస్తుతం తన బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుకునే కథ కోసం ఎదురుచూస్తున్నాడు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ కోసం యష్ వెయిట్ చేస్తున్నాడు. తాజాగా, కేజీఎఫ్ చాప్టర్ 3 చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మాత విజయ్ కిరంగదూర్ అధికారికంగా ధృవీకరించారు.
Read Also: Drugs Caught: కొకైన్ తరలించేందుకు కొత్త స్కెచ్.. అడ్డంగా బుక్కైన కిలాడి లేడి
అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలంటే కొన్నాళ్లు పట్టవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా యష్ 19వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. మలయాళ నటి, దర్శకురాలు యష్ తో సినిమా చేయనుంది. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి రైటర్ గా మారి ఇప్పుడు దర్శకురాలిగా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ఇప్పటికే మూడు సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ఆమె యష్‌కి మాఫియా బ్యాక్ డ్రాప్ కథను వినిపించింది. ఆయనకు ఈ కథ బాగా నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇది పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: Hail rain: ఆ జిల్లాల్లో వడగళ్ల వాన! ఆందోళనలో రైతులు
త్వరలోనే దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. యష్ ఒక లేడీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అంటే అది కచ్చితంగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారికంగా కన్ఫర్మ్ అయ్యే వరకు ఆగాల్సిందే.