ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధ్వర్యంలో సోమవారం నాడు సాయంత్రం గన్నవరంలోని రోటరీ క్లబ్ హాల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం నియోజకవర్గ నలువైపుల నుంచి మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర హితం కోసమే మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ పొత్తును ప్రజలు ఆమోదించారని అందుకు చిలకలూరిపేటలో జరిగిన సభ నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త గెలుపే లక్ష్యంగా పని చేసి ప్రజలతో మమేకం కావాలని ఆయన కోరారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరువాత కష్టపడి పని చేసిన వారిని గుర్తించి సముచిత స్ధానం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా గన్నవరంలో ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు యార్లగడ్డ ప్రకటించారు.
Read Also: Rangareddy: రేపు హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..?
అయితే, రాబోయే ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల ద్వారా మెరుగైన సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలు అమలు చేసి వారిని ఆర్థికంగా, సామాజికంగా అగ్రపథంలో నడపించాలనే సంకల్పంతో గన్నవరం నియోజకవర్గంలోని పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్ధలాలు పంపిణీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఈ అవినీతి, అరాచక పాలకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పి రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడాలని ప్రజలకు యార్లగడ్డ వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ సమావేశం తర్వాత నున్న గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు యర్కారెడ్డి వెంకట్ రెడ్డి, వార్డు సభ్యుడు ప్రత్తిపాటి సుందరయ్య, వార్డు సభ్యుడు పెయ్యల రాజా, పెయ్యల రజిని, వారితో పాటు మరో 50 మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరగా.. యార్లగడ్డ వెంకట్రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Read Also: Sadhguru Jaggi Vasudev: సద్గురు ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్డేట్.. వైరల్ వీడియో..!
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు అంజిబాబు, మండల అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు గొడ్డళ్ళ చిన్న రామారావు, ఉంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, బాపులపాడు మండల పార్టీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, ఆళ్ళ గోపాలకృష్ణ, బోసు బాబు, గుజ్జర్లపూడి బాబురావు, దొందు చిన్న, గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బండ్రెడ్డి రవి, చిమట రవివర్మ, గంధం గోవర్ధన్, పొదిలి దుర్గారావు, పచ్చిపాల లక్ష్మణ్ రావు, వడ్డె శివ నాగేశ్వరరావు, శ్రీపతి శిరీష, మేకల స్వాతి, సంధ్య, నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి డా. ఫణి, చిగురుపాటి కుమారస్వామి, లక్కంరాజు మల్లిఖార్జున రాజు, నాదెళ్ల మోహన్, నల్లూరి కోటేశ్వరరావు, కాటూరి శేషు మాధవి, శ్రీనివాసరావు, బుజ్జి, మేడేపల్లి రమ, బస్వరాజు, కొండ, మొవ్వ వెంకటేశ్వరరావు, సాంబిరెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.