Gannavaram: చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని యాగం చేపట్టిన యార్లగడ్డ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో యాగం చేపట్టారు. మూడు రోజుల పాటు చేపట్టనున్న అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం సోమవారం ప్రారంభమైంది. గన్నవరం ప్రజలు సుఖ:సంతోషాలతో వర్ధిల్లటంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. ఈ యాగం చేపట్టినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమం 26, 27, 28 తేదీల్లో జరుగనుంది. ఈ సందర్భంగా.. యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి పాల్గొని వేద పండితుల ఆధ్వర్యంలో అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి సుదర్శన లక్ష్మీనారసింహ యాగంను ప్రారంభించారు. అంతకుముందు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరికి వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ ఘన స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటే.. గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా యార్లగడ్డ వెంకట్రావు పలు అభివృద్ధి పనులను చేపడుతూ.. జనాల్లో మంచి ఆదరాభిమానాలను పెంచుకుంటున్నారు. అంతేకాకుండా.. ఆలయాల అభివృద్ధి కోసం ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని, గెలిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. కాగా.. టీడీపీ తొలి జాబితాలో గన్నవరం టికెట్‌ను యార్లగడ్డ వెంకట్రావు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్‌మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!