NTV Telugu Site icon

Delhi Rains: హెచ్చరిక స్థాయికి యమునా నది నీటిమట్టం.. కేజ్రీవాల్ అత్యవసర మీటింగ్..!

Yamuna

Yamuna

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో నీటిమట్టం హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పాత రైల్వే వంతెన వద్ద యమునా నీటిమట్టం 204.36 మీటర్లకు చేరుకుంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నాటికి యమునా నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. హథిని కుండ్ బ్యారేజీ నుంచి నిరంతరం నీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నది నీటిమట్టం పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు హథిని కుండ్ బ్యారేజీ నుంచి యమునా నదిలోకి 1,90,837 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Free Cancer Screening Camp:మెగాస్టార్ చిరంజీవి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు విశేష స్పందన

మరోవైపు ఢిల్లీలో వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది రాజకీయాలకు సమయం కాదని అన్నారు. గతంలో ఢిల్లీ, ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురిశాయి. ప్రజలకు సహాయం అందించేందుకు మనమంతా కలిసి పని చేయాలని తెలిపారు. సీడబ్ల్యూసీ (CWC) ప్రకారం.. ఢిల్లీలో యమునా నది 203.58 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. రేపు ఉదయం 205.5 మీటర్లకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే వాతావరణ అంచనా ప్రకారం.. యమునాలో నీటి మట్టం పెద్దగా పెరిగే అవకాశం లేదు. యమునా 206 మీటర్ల మార్కును దాటితే, మేము pic.twitter.com/x5lej3J2ugని ప్రారంభిస్తామన్నారు.

New Delhi: సత్యేంద్ర జైన్ కు మధ్యంతర బెయిల్ పొడిగింపు.. సుప్రీంకోర్టు ఆదేశాలు

మరోవైపు యమునా నదికి ఎక్కువ నీరు విడుదల చేయడంతో వరద ముప్పు పొంచి ఉంది. ఢిల్లీలో వర్షం 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఇంత వర్షానికి ఢిల్లీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. అంతేకాకుండా ఈరోజు కూడా ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో యమునా నీటిమట్టం ఈరోజు ప్రమాద స్థాయిని దాటనుంది. గత రెండు రోజులుగా భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని.. రేపు ఢిల్లీలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే అతిశి సింగ్ యమునా నదిని పరిశీలించారు. రేపు ఉదయానికి నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటే అవకాశం ఉందని తెలిపారు. యమునా నదికి సమీపంలో నివసించే ప్రజల కోసం తరలింపు మరియు వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.