తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొత్తం 11 రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈరోజు నరసింహస్వామి తిరు కళ్యాణం జరగనుంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి తలంబ్రాలు సమర్పించనున్నారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రాత్రికి నారసింహుడి గజవాహన సేవ నిర్వహిస్తారు. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
Also Read : TSLPRB : మహిళ అభ్యర్థుల అలర్ట్.. నేడే లాస్ట్ డేట్
ఇదిలా ఉంటే.. శ్రీ స్వామివారి దివ్య విమాన రథోత్సవం మార్చి 1న నిర్వహించనున్నారు. అలాగే.. మార్చి 03న సాయంత్రం శ్రీ స్వామివారి శృంగార డోలోత్సవముతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగయనున్నాయి. అయితే.. బ్రహ్మోత్సవాల సందర్భంగా.. 11 రోజులపాటు ఆలయములో రోజూ జరిగే నిత్య కళ్యాణం, సుదర్శన నరసింహ హోమం రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు అభిషేకం, అర్చనలు రద్దు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
Also Read : CM YS Jagan: రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఇవాళే ఆ సొమ్ము పంపిణీ
ఇదిలా ఉంటే.. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నేడు యాదగిరిగుట్టపైకి వాహనాలను అనుమతించమని యాద్రాది భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. అయితే డీసీపీ సంతకంతో జారీ అయిన పాస్‌లు ఉన్న వారికి మాత్రమే గుట్టపైకి అనుమతి ఉంటుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. కళ్యాణం వీక్షించేందుకు వచ్చేవారికి స్పెషల్ పాస్‌లు ఉంటేనే అనుమతి ఉంటుందని ఆయన వెల్లడించారు. పాస్‌లు లేని వారు బయట ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై కళ్యాణం వీక్షించాలని, ఈ పాస్‌ల కోసం ఆలయ అధికారులను సంప్రదించాలని సూచించారు డీసీపీ రాజేష్ చంద్ర. పాస్‌లు లేని వారు గుట్ట కింద తమ వాహనాలను పార్కు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
