Xiaomi QLED TV X Pro Series: గేమింగ్ మోడ్ ఫీచర్ తో షియోమీ కొత్త స్మార్ట్ టీవీ వచ్చేస్తోంది..
- గేమింగ్ మోడ్ ఫీచర్ తో షియోమీ కొత్త స్మార్ట్ టీవీ
- Xiaomi QLED TV X Pro సిరీస్ వచ్చే వారం భారత్ లో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తయారీ కంపెనీ షియోమీ సరికొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. Xiaomi QLED TV X Pro సిరీస్ వచ్చే వారం భారత్ లో రిలీజ్ చేయనుంది. కొత్త మోడళ్లు ఇప్పటికే ఉన్న మోడళ్ల కంటే మెరుగైన ఆడియో-విజువల్ ఫీచర్లతో సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తాయని పేర్కొంటున్నాయి. ఈ స్మార్ట్ టీవీలకు ప్రత్యేక గేమింగ్ మోడ్ ఉంటుంది. Xiaomi ఆగస్టు 2024లో 4K రిజల్యూషన్‌తో 43-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల డిస్ప్లే సైజులలో X Pro QLED సిరీస్‌ను ప్రవేశపెట్టింది.
Also Read:IndiGo: చిన్నారి బంగారు గొలుసు దొంగతనం.. “ఇండిగో” మహిళా సిబ్బందిపై ఆరోపణ..
Also Read
- CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
Xiaomi QLED TV X Pro సిరీస్ ఏప్రిల్ 10న భారత్ లో విడుదలవుతుందని కంపెనీ Xలో ప్రకటించింది. Xiaomi ఇండియా మైక్రోసైట్ ప్రకారం, ఈ టీవీ మోడల్స్ గేమ్ బూస్టర్ మోడ్‌ను కలిగి ఉంటాయి. ఇది లాగ్-ఫ్రీ, స్మూత్ గేమ్‌ప్లేను క్లెయిమ్ చేస్తుంది. మైక్రోసైట్ ప్రకారం.. Xiaomi QLED TV X Pro సిరీస్‌లో Google అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది. వీటిలో QLED డిస్ప్లేలు ఉంటాయి. ఇవి 4K రిజల్యూషన్, ఇమ్మర్సివ్ ఆడియో సిస్టమ్‌లతో వస్తున్నాయి.
ఈ స్మార్ట్ టీవీలను ఫ్లిప్‌కార్ట్, షియోమి ఇండియా ఈ-స్టోర్, రిటైల్ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత Xiaomi X Pro QLED సిరీస్ ఆగస్టు 2024లో భారత్ లో ప్రారంభించింది. ఈ లైనప్ 43-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల డిస్ప్లే సైజులలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.34,999, రూ.49,999, రూ.69,999. ఈ టీవీలు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 4K (2,160×3,840 పిక్సెల్స్) డిస్ప్లేలను, డాల్బీ విజన్, వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 లను కలిగి ఉన్నాయి. ఇవి క్వాడ్-కోర్ ఆర్మ్ కార్టెక్స్-A55 చిప్సెట్, మాలి G52 MC1 GPU, 12GB RAM, 32GB స్టోరేజ్‌తో వచ్చాయి. అవి Xiaomi ప్యాచ్‌వాల్ UI పైన Google TVలో పనిచేస్తాయి.
తాజావార్తలు
-
CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!