X Blocks Accounts: భారత్‌లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేసిన X.. ప్రభుత్వ ఆదేశాలపై స్పందన.!

  • ప్రభుత్వ ఆదేశాల ప్రకారం..
  • భారత్‌లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేసిన X.
X

X

X Blocks Accounts: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X భారత్‌లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేయడం ప్రారంభించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోతే భారీ జరిమానాలు, దేశీయ ఉద్యోగులకు జైలుశిక్ష విధించబడతాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ బ్లాక్‌ చేయబడిన ఖాతాల్లో అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖ సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఉన్నట్లు సమాచారం. X కంపెనీ ప్రకటనలో తెలిపిన ప్రకారం, “ప్లాట్‌ఫారమ్‌ను భారత్‌లో అందుబాటులో ఉంచడం చాలా కీలకం. కానీ, ఇది తేలికైన నిర్ణయం కాదు” అని పేర్కొంది.

Read Also: Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు.. రాత్రిపూట దాడులపై స్థానికులు ఏం చెబుతున్నారంటే..?

ఇందుకు సంబంధించి X ప్రకటనలో పేర్కొన్నదేమిటంటే.. భారత ప్రభుత్వం ఇచ్చిన అనేక ఆదేశాల్లో ఏ ఖాతాలో ఏమి తప్పు జరిగిందన్న స్పష్టత లేదు. చాలా సందర్భాల్లో ఖాతాలను బ్లాక్ చేయడానికి సరైన ఆధారాలు లేదా వివరాలే ఇవ్వలేదని తెలిపింది. అదే విధంగా, పోస్ట్‌లను కాకుండా మొత్తం ఖాతాలను బ్లాక్ చేయడం అనవసరం. ఇది సెన్సార్‌షిప్‌తో సమానం. భవిష్యత్ కంటెంట్‌కూ ఈ ప్రభావం ఉంటుందని కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఈ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను పబ్లిక్ చేయడం పారదర్శకతకు కీలకం. వాటిని గోప్యంగా ఉంచడం వల్ల బాధ్యతారాహిత్యం పెరిగే అవకాశం ఉంది. అయితే, భారత చట్టాల పరిమితుల వల్ల కంపెనీ ఆదేశాలను పబ్లిష్ చేయలేకపోయిందని పేర్కొంది.

Read Also: Bollywood : ఆపరేషన్ సింధూర్ పై కనీసం స్పందించని బాలీవుడ్ ‘ఖాన్స్’

తమ నిబంధనల ప్రకారం, X బ్లాక్ చేయబడిన ఖాతాల యజమానులకు నోటిఫికేషన్లు పంపించింది. అంతేకాకుండా iProbono India, National Legal Services Authority వంటి న్యాయ సహాయక సంస్థల సమాచారాన్ని తెలుపుతూ, న్యాయ సహాయం పొందాలని ప్రోత్సహించింది. అలాగే భారత చట్టాల ప్రకారం కంపెనీకి ఈ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను న్యాయంగా ప్రశ్నించే అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి. భారతీయ వినియోగదారులకు ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.