X Blocks Accounts: భారత్‌లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేసిన X.. ప్రభుత్వ ఆదేశాలపై స్పందన.!
- ప్రభుత్వ ఆదేశాల ప్రకారం..
- భారత్‌లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేసిన X.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
X Blocks Accounts: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X భారత్‌లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేయడం ప్రారంభించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోతే భారీ జరిమానాలు, దేశీయ ఉద్యోగులకు జైలుశిక్ష విధించబడతాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ బ్లాక్ చేయబడిన ఖాతాల్లో అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖ సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఉన్నట్లు సమాచారం. X కంపెనీ ప్రకటనలో తెలిపిన ప్రకారం, “ప్లాట్‌ఫారమ్‌ను భారత్‌లో అందుబాటులో ఉంచడం చాలా కీలకం. కానీ, ఇది తేలికైన నిర్ణయం కాదు” అని పేర్కొంది.
Also Read
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
ఇందుకు సంబంధించి X ప్రకటనలో పేర్కొన్నదేమిటంటే.. భారత ప్రభుత్వం ఇచ్చిన అనేక ఆదేశాల్లో ఏ ఖాతాలో ఏమి తప్పు జరిగిందన్న స్పష్టత లేదు. చాలా సందర్భాల్లో ఖాతాలను బ్లాక్ చేయడానికి సరైన ఆధారాలు లేదా వివరాలే ఇవ్వలేదని తెలిపింది. అదే విధంగా, పోస్ట్‌లను కాకుండా మొత్తం ఖాతాలను బ్లాక్ చేయడం అనవసరం. ఇది సెన్సార్‌షిప్‌తో సమానం. భవిష్యత్ కంటెంట్‌కూ ఈ ప్రభావం ఉంటుందని కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఈ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను పబ్లిక్ చేయడం పారదర్శకతకు కీలకం. వాటిని గోప్యంగా ఉంచడం వల్ల బాధ్యతారాహిత్యం పెరిగే అవకాశం ఉంది. అయితే, భారత చట్టాల పరిమితుల వల్ల కంపెనీ ఆదేశాలను పబ్లిష్ చేయలేకపోయిందని పేర్కొంది.
Read Also: Bollywood : ఆపరేషన్ సింధూర్ పై కనీసం స్పందించని బాలీవుడ్ ‘ఖాన్స్’
తమ నిబంధనల ప్రకారం, X బ్లాక్ చేయబడిన ఖాతాల యజమానులకు నోటిఫికేషన్లు పంపించింది. అంతేకాకుండా iProbono India, National Legal Services Authority వంటి న్యాయ సహాయక సంస్థల సమాచారాన్ని తెలుపుతూ, న్యాయ సహాయం పొందాలని ప్రోత్సహించింది. అలాగే భారత చట్టాల ప్రకారం కంపెనీకి ఈ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను న్యాయంగా ప్రశ్నించే అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి. భారతీయ వినియోగదారులకు ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
X has received executive orders from the Indian government requiring X to block over 8,000 accounts in India, subject to potential penalties including significant fines and imprisonment of the company’s local employees. The orders include demands to block access in India to…
— Global Government Affairs (@GlobalAffairs) May 8, 2025
తాజావార్తలు
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్‌టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్‌పే, పేటీఎంకు పోటీగా సేవలు!
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!