WTC Points Table: కర్మ తిరగబడింది.. వెస్టిండీస్ దెబ్బకి కుప్పకూలిన పాకిస్థాన్ ఆశలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోని తొలి పోరులో పాకిస్థాన్ 90 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. వెస్టిండీస్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాయింట్ల పట్టిక స్థానాల్లో ఎలాంటి పెద్ద మార్పులు లేవు. పాకిస్థాన్ ఆడిన 5 మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి, 6.67 గెలుపు శాతంతో 9 జట్ల పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ జట్టు ఈ విజయంతో తన గెలుపు శాతాన్ని స్వల్పంగా పెంచుకున్నప్పటికీ 22.73 శాతంతో 8వ స్థానంలోనే ఉంది.
మరోవైపు ఈ సైకిల్లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ ఆడిన 8 మ్యాచ్‌లలో 7 విజయాలు సాధించి 87.50 గెలుపు శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఛాంపియన్ దక్షిణాఫ్రికా 4 మ్యాచ్‌లలో 3 గెలిచి 75 శాతం విజయాలతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 6 మ్యాచ్‌లలో 4 విజయాలతో 72.22 శాతంతో మూడో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 4 మ్యాచ్‌లలో 2 గెలిచి 58.33 శాతంతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 4 విజయాలు, 4 ఓటములు, ఒక డ్రాతో 48.15 గెలుపు శాతాన్ని కలిగి ఉంది. శ్రీలంక జట్టు 41.67 గెలుపు శాతంతో ఆరో స్థానంలో నిలవగా, ఇంగ్లాండ్ జట్టు ఆడిన 13 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్రమే గెలిచి 24.36 గెలుపు శాతంతో ఏడో స్థానంలో పరిమితమైంది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తాయి. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఈ డబ్ల్యూటీసీ ట్రోఫీని గెలుచుకున్నాయి. ప్రస్తుత సైకిల్ ఫైనల్ పోరు 2027లో ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!