వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనరల్ ఆడే భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 7-11 మధ్య లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 15 మంది సభ్యలతో కూడిన జట్టును బీసీసీఐ మంగళవారం నాడు ప్రకటిచింది.
Read Also : The Kerala Story: ‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహాలో మరో సినిమా! వివాదాల నీలినీడలు!!
అయితే జట్టులో రెండు, మూడు మార్పులు మినహా బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడిన జట్టునే దాదాపు కొనసాగించింది. వెన్నుగాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేను తీసుకున్న సెలక్టర్లు.. ఇషాన్ కిషన్ తో పాటు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ లపై వేటు వేసింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత అనూహ్య పరిస్థితుల్లో రహానే తిరిగి టీమిండియాలోకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Read Also : CM KCR: వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తాం.. జాగ్రత్తగా పనిచేయండి
గతేడాది సౌతాఫ్రికా పర్యటనలో లాస్ట్ గా భారత్ కు ప్రాతినిథ్యం వహించిన అజింక్యా రహానే పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోవడంతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. దాంతో అతని కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ రంజీ ట్రోఫీలో సత్తా చాటిన రహానే.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ధోని సారథ్యంలో రహానే చెలరేగిపోతున్నాడు.
Read Also : Chandrababu Naidu: కుప్పంపై చంద్రబాబు కీలక నిర్ణయం.. పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగింత..!
అయితే రహానేను ఎంపిక చేసేముందు టీమిండియా మేనేజ్మెంట్ ధోని అభిప్రాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా ధోనీకి ఫోన్ చేసి రహానే ఫిట్ నెస్, ఆటతీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. శ్రేయస్ అయ్యర్ దూరమైనప్పటి నుంచి అజింక్యా రహానే మా ప్రణాళికల్లో ఉన్నాడు. అతనికి ఇంగ్లండ్ లో ఆడిన అనుభవం ఉంది. అక్కడ మంచి రికార్డు కూడా ఉంది. అయితే గతేడాదిగా అతను టీమ్ సెటప్ లో లేడు.. రంజీ ట్రోఫీలో ఎలా ఆడిందనేదే మాకు తెలుసు.. అందుకే రాహుల్ ద్రవిడ్ ధోనీ దగ్గర నుంచి ఇన్ పుట్స్ తీసుకున్నాడు అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
Read Also : CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ
రంజీ ట్రోఫీలో ముంబై జట్టు కెప్టెన్ గా రహానే.. 11 ఇన్సింగ్స్ ల్లో 57.63 యావరేజ్ తో 634 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్సింగ్స్ ల్లో 209 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 199.04గా ఉండడం విశేషం. స్వింగ్ బౌలింగ్ ను రహానే అద్భుతంగా ఆడగలిగే సామర్థ్యం ఉంది.
