భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్.. లింగమార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) తర్వాత అమ్మాయిగా మారాడు. తన పేరును ‘అనయ బంగర్’గా మార్చుకున్నాడు. అనయగా మారిన అనంతరం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ.. తన పరివర్తన గురించి డీటైల్స్ పంచుకుంది. ఆ మధ్య రియాలిటీ షోలో కూడా పాల్గొంది. తాజాగా అనయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అనయ పాల్గొనడం గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలకు దారితీసింది.
అనయ బంగర్ తండ్రి సంజయ్ బంగర్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి కోచ్‌గా పనిచేశారు. కాబట్టి అనయ కూడా జట్టు తరపున ఆడాలని భావిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో ఆర్సీబీ క్రికెట్ కిట్ బ్యాగ్‌తో మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్ చేసింది. ముందుగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన అనయ.. ఆపై పాడ్స్ కట్టుకుని బ్యాట్ చేతపట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వచ్చే మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ మహిళా జట్టులో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలకు దారితీసింది. అయితే అంతర్జాతీయ మహిళా క్రికెట్ నుంచి ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులను ఐసీసీ నిషేధించినందున.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటానికి అనయను అనుమతిస్తారా అనేది పెద్ద ప్రశ్న.
Also Read: IPL 2026-CSK: ఐపీఎల్ 2026 వేలంకు ముందే సంచలనం.. సీఎస్కేలోకి సంజు, జడేజా ఔట్!
అనయ బంగర్ ‘రైజ్ అండ్ ఫాల్’ అనే రియాలిటీ షోలో పాల్గొంది. ‘నేను నా హక్కుల కోసం పోరాడతాను. ఒక రోజు భారతదేశం తరపున ప్రపంచకప్ గెలుస్తాను’ అని భావోద్వేగంగా తెలిపింది. ఇటీవల భారత మహిళా జట్టు ప్రపంచకప్ 2025 గెలిచినప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసి అభినందనలు కూడా తెలిపింది. అనయ ఇటీవలి పోస్ట్‌లు ప్రొఫెషనల్ క్రికెట్లోకి రావడానికి ఆమె తీవ్రంగా శ్రమిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. కానీ రూల్స్ మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. మరి క్రికెట్ ఆడలనే కల నెరవేరుతుందో లేదో చూడాలి. ఇక సంజయ్ బంగర్‌కు ఇద్దరు కుమారులు కాగా.. పెద్దవాడే ఆర్యన్. సంజయ్ భారత్ తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడారు.