NTV Telugu Site icon

PSL 2024: వావ్ సూపర్ క్యాచ్.. బాల్‌ బాయ్‌ను హగ్‌ చేసుకున్న స్టార్‌ బ్యాటర్‌..

Hug

Hug

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2024లో భాగంగా సోమవారం పెషావర్‌ జెల్మీ, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు కోలిన్ మున్రో బాల్ బాయ్ ను ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: PM Modi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నరాలు తెగిపోతాయి.. ప్రధాని మోడీకి హత్యా బెదిరింపులు..

పెషావర్ బ్యాటర్ అమీర్ జమాల్ భారీ సిక్స్ కొట్టాడు. అయితే బౌండరీ లైన్ అవతల ఉన్న బాల్ బాయ్ బాల్ ను అందుకునుందేకు ప్రయత్నించాడు. అయితే తన చేతికి అందలేదు. దీంతో అది గమనించిన మున్నో ఆ బాయ్ బాల్ దగ్గరికి వెళ్లి బాల్ ను ఎలా పట్టుకోవాలో చెప్పాడు. ఆ తర్వాత పెషావర్ బ్యాటర్ ఆరిఫ్ యూకుడ్ మరో భారీ సిక్సర్ బాదాడు.

Read Also: DSP Praneeth Rao: డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్లో కీలక విషయాలు..

ఈసారి మాత్రం బాల్ బాయ్ మిస్ చేయలేదు. క్యాచ్ ను అద్భుతంగా పట్టుకున్నాడు. అయితే ఈసారి క్యాచ్ మిస్ చేయలేదంటూ మున్రో.. అతడి దగ్గరికి వెళ్లి హగ్ చేసుకున్నాడు.. అంతేకాకుండా అతన్ని అభినందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా.. ఈ మ్యాచ్ లో పెషావర్ పై ఇస్లామాబాద్ 29 పరుగుల తేడాతో గెలిచింది.