మనుషుల్లో అతి పొట్టి, అతిపొడవు ఉన్నట్టుగానే సాధు జంతువుల్లో కూడా అతి పొట్టివి ఉన్నాయి. తాజాగా ప్రపంచంలోనే అతి చిన్న మేక వెలుగులోకి వచ్చింది. అంతేకాదు అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకుంది. కేరళకు చెందిన ఓ రైతు ప్రపంచంలోనే అతి చిన్న మేకను కలిగి ఉన్నాడు. ఈ చిన్న మేక యజమాని పీటర్ లెన్ను. తన మేకకు కరుంబి అని పేరు పెట్టాడు. అయితే అది అతి పొట్టిగా ఉండడంతో.. గిన్నిస్ రికార్డు పుస్తకంలో నమోదు చేసుకోవడానికి ప్రయత్నించాలని పలువురు సూచించినట్లు తెలిపాడు.
Also Read:KTR: చేయని శపథం లేదు.. ఆడని అబద్దం లేదు.. అక్షరాల 420 అబద్దపు హామీలు
అతను ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాడు. దానిని పశువైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కరుంబి ఎత్తు, ఆరోగ్యాన్ని తనిఖీ చేశారు. అది పూర్తిగా ఆరోగ్యంగా ఉందని, పూర్తిగా అభివృద్ధి చెందిందని, కానీ ఎత్తు తక్కువగా ఉందని నిర్ధారించారు. గిన్నిస్ బుక్ ప్రకారం ఈ మేక 2021లో జన్మించింది. పూర్తిగా పెరిగిన తర్వాత కూడా దాని ఎత్తు 1 అడుగు 3 అంగుళాలు మాత్రమే ఉంది. ఈ మేక కెనడియన్ పిగ్మీ జాతికి చెందినదని తెలిపారు.
Also Read:Sekhar Kammula : ప్రేక్షకులకు కొత్తగా ఏదైనా చూపించాలి అనేది నా ప్రయత్నం..
ఇది తక్కువ ఎత్తు, జన్యు మరుగుజ్జుకు ప్రసిద్ధి చెందింది. ఈ మేకల కాళ్ళు సాధారణంగా 21 అంగుళాల కంటే పొడవుగా పెరగవు. ప్రస్తుతం ఈ చిన్న మేక గర్భవతిగా ఉంది. ఈ నేపథ్యంలో దాని పిల్లలు కూడా పొట్టిగా ఉంటారని.. అవి కూడా కొత్త రికార్డు సృష్టించగలవని భావిస్తున్నారు. కరుంబి.. మరో మూడు మగ మేకలు, తొమ్మిది ఆడ మేకలు, పది చిన్న పిల్లలతో నివసిస్తుందని పీటర్ లెన్ను తెలిపారు.