Mohammad Yunus: బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్‌కు అగ్రరాజ్యం సాక్షిగా ఘోర అవమానం ఎదురైంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్ చేరుకున్న యూనస్ బృందంపై పలువురు గుడ్లతో దాడి చేశారు. అలాగే ఆయన గత మూడు రోజులుగా న్యూయార్క్‌లో ఒక్క ప్రముఖ నాయకుడిని కూడా కలవలేకపోయాడు. ముస్లిం దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్‌ను కూడా ఒంటరిని చేశాయనే వాదనలు వినిస్తున్నాయి.
READ ALSO: Finland: ‘‘భారత్ ఒక సూపర్ పవర్’’..ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ప్రశంసలు..
గుడ్లతో స్వాగతం..
షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఆగస్టు 2024లో కూలదోసిన తర్వాత బంగ్లాదేశ్‌లో యూనస్ అధికార పగ్గాలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బంగ్లాదేశ్ తరఫున మాట్లాడటానికి న్యూయార్స్‌కు వచ్చారు. ఆయనతో పాటు బంగ్లాదేశ్ రాజకీయ నాయకుల బృందం కూడా వచ్చింది. ఈక్రమంలో మొహమ్మద్ యూనస్ సోమవారం (సెప్టెంబర్ 22) తన ప్రతినిధి బృందంతో అమెరికాకు చేరుకున్న సమయంలో వారిపై షేక్ హసీనా మద్దతుదారులు గుడ్లు విసిరారు. అలాగే యూనస్ కారును కూడా ఆపారు. అరెస్టు చేసిన నిందితులను పోలీసులు 24 గంటల్లో విడుదల చేశారు. 193 దేశాల నాయకులు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనడానికి న్యూయార్క్‌లో ఉన్న సమయంలో, అమెరికాలో యూనస్ ఇంత వ్యతిరేకతను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
అగ్ర నాయకులతో సమావేశం కాలేదు..
బంగ్లాదేశ్ తాత్కాలిక అధిపతి యూనస్ గత మూడు రోజుల్లో ఒక్క ప్రధాన దేశ నాయకుడిని కూడా కలవలేదు. న్యూయార్క్‌లో యూనస్ కేవలం చిన్న దేశాల నాయకులు, అధికారులను మాత్రమే కలిశారు. ఇప్పటి వరకు యూనస్ పారిస్ మేయర్, అమెరికన్ రాయబారిని మాత్రమే కలిశారు. కానీ పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్, తుర్కియే వంటి దేశాల అధిపతులను కలిశారు. షాబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్‌తో కూడా సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యూనస్ సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక చర్చలు ఎందుకు జరపడం లేదో స్పందించలేదు.
ముస్లిం నాయకుల సమావేశానికి కూడా ఆయన గైర్హాజరు అయ్యారు. ముస్లిం దేశాల నాయకులు న్యూయార్క్‌లో రెండు ప్రధాన సమావేశాలు నిర్వహించారు. ఒకటి గాజాపై, మరొకటి కాశ్మీర్‌పై వారు సమావేశం అయ్యారు. బంగ్లాదేశ్‌ను ఈ రెండు సమావేశాలకు ఆహ్వానించనట్లు సమాచారం. బంగ్లాదేశ్ ఒక ముస్లిం మెజారిటీ దేశం. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, యూనస్ దేశంలో అధికార పగ్గాలు స్వీకరించారు. అనంతరం ఆయన పాకిస్థాన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపారు.
READ ALSO: OIC Kashmir Meeting: అగ్రరాజ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాల సమావేశం..