దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా వన్డే ప్రపంచకప్ 2027ను అక్టోబర్-నవంబర్‌లలో నిర్వహిస్తాయి. 2003 తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వే కలిసి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. ఈ టోర్నీలో టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇద్దరు ప్రపంచకప్‌లో ఆడుతారని కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ హింట్ ఇచ్చినా.. అందరికి అనుమానాలే ఉన్నాయి. వీరితో పాటు మరో ముగ్గురు కూడా మెగా టోర్నీలో ఆడడం డౌటే అని తెలుస్తోంది.
రోహిత్ శర్మ:
1987లో జన్మించిన రోహిత్ శర్మకు 2027 ప్రపంచకప్ నాటికి 40 సంవత్సరాలు నిండుతాయి. శుభ్‌మాన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించడానికి ఈ వయసే కారణం. హిట్‌మాన్ ఫిట్‌నెస్ గురించి ఎప్పటికప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్టోబర్ 19న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రోహిత్ తదుపరి ప్రపంచకప్‌లో ఆడతాడా లేదా అనేది స్పష్టమవుతుంది.
విరాట్ కోహ్లీ:
ప్రపంచంలోని అత్యంత ఫిట్‌నెస్ ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. టీ20, టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన విరాట్.. వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు:2027 నాటికి విరాట్ వయస్సు 38-39 సంవత్సరాలు. అయితే కోహ్లీ 18 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిలాగే ఫిట్‌గా ఉంటాడు. తదుపరి ప్రపంచ కప్‌లో కోహ్లీ పాల్గొనడం ఆస్ట్రేలియా పర్యటన, సెలెక్టర్లపై ఆధారపడి ఉంటుంది.
మొహమ్మద్ షమీ:
మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. శస్త్రచికిత్సలు, పనిభార నిర్వహణను అతడి శరీరం తట్టుకోలేకపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా బుమ్రా తర్వాత అత్యంత విజయవంతమైన బౌలర్‌గా షమీ ఉండు. కానీ అతను తన గాయాల నుండి కోలుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాని అతడు.. బెంగాల్ తరపున రంజీ ట్రోఫీలో ఆడి ఫామ్ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. తదుపరి ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్నానని షమీ చాలాసార్లు చెప్పాడు కానీ.. జట్టు యాజమాన్యం సిరాజ్ హర్షిత్ రాణా వంటి యువకులకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటోంది.
రవీంద్ర జడేజా:
రవీంద్ర జడేజా కూడా ఫిట్‌గా ఉన్నాడు. కానీ రోహిత్, విరాట్ లాగానే అతను కూడా 2024 ప్రపంచకప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. మీడియా నివేదికల ప్రకారం.. ఆస్ట్రేలియా సిరీస్ నుండి తొలగించడం వల్ల సెలెక్టర్లు ఇప్పుడు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లపై ఎక్కువ దృష్టి సారించారని సూచిస్తుంది. కాబట్టి ప్రపంచకప్ జట్టులో ఈ ఆల్ రౌండర్ ఆడకపోవచ్చు.
రిషబ్ పంత్:
ఈ జాబితాలో చివరి పేరు రిషబ్ పంత్. భారత విధ్వంసక బ్యాట్స్‌మన్ గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతన్ని ఆస్ట్రేలియా పర్యటనలో చేర్చలేదు. అతను ఇకపై భారత వైట్-బాల్ ఫార్మాట్‌లో జట్టు మొదటి ఎంపిక కాదు. మేనేజ్‌మెంట్ అతన్ని టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే ఆడిస్తుంది. లోకేష్ రాహుల్, ధ్రువ్ జురెల్ వన్డే సిరీస్ కోసం వికెట్ కీపర్లుగా భారత జట్టులో భాగం అవుతారు. రాహుల్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఎంపిక కావడం ఖాయం కాబట్టి అతను వికెట్ కీపింగ్ బాధ్యత వహించవచ్చు.
