NTV Telugu Site icon

CM Chandrababu: అమరావతికి రూ.15వేల కోట్లు.. చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధుల భేటీ

Amaravati

Amaravati

CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఆ నిధులను సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి నిధులు అందించే విషయమై చర్చించారు. అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు, దశలవారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు చర్చలు జరిపారు.

Read Also: Minister Atchannaidu: ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు.. వ్యవసాయ మంత్రి కీలక ఆదేశాలు

అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్ర స్థాయి పర్యటనలు, భూ సమీకరణ, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. రాజధాని పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. సీఆర్డీఏ పరిధిలో క్షేత్ర స్థాయిలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు. ఈ నెల 27వ తేదీ వరకు ఏపీలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించనున్నారు.