Site icon NTV Telugu

World Asthma Day 2025: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఆస్తమా కావచ్చు.. జాగ్రత్త సుమీ!

World Asthma Day 2025

World Asthma Day 2025

World Asthma Day 2025: ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించి ఓ దీర్ఘకాలిక వ్యాధి. ఇది శ్వాసనాళాల్లో వాపు, సంకోచం వల్ల ఏర్పడుతుంది. ఈ కారణాల వల్ల శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఈ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం నాడు వరల్డ్ ఆస్తమా డే (World Asthma Day) పాటించబడుతుంది. ఈ సంవత్సరం ఇది మే 6, 2025 న జరుగుతోంది. ఇక ఈ రోజు ముఖ్య ఉద్దేశం, ఆస్తమా బాధితులను ఆరోగ్యంగా జీవించేందుకు ప్రేరేపించడం, వ్యాధి భారం తగ్గించేందుకు అవసరమైన సమాచారంతో పాటు మద్దతును అందించడం. అయితే అసలు ఆస్తమా వ్యాధి కలగడానికి గల ముఖ్యమైన లక్షణాలను చూద్దాం.

Read Also: Minister Kondapalli and MLA Ganta: మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే గంటాకు తప్పిన ప్రమాదం

అలర్జీలు (Allergies):
కొంతమంది శరీరాలలో ఇతరుల కంటే ఎక్కువగా అలర్జీ ప్రతిచర్యలు కనిపిస్తాయి. ధూళి కణాలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బూదిద వంటి వాటికి అలర్జీ ఏర్పడడం వల్ల ఆస్తమా రావడానికి కారణమవుతుంది.

ధూమపానం (Smoking):
సిగరెట్ పొగ శ్వాసనాళాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ధూమపానం చేసే వారికి ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ. గర్భధారణ సమయంలో తల్లి ధూమపానం చేస్తే, ఆ శిశువుకి భవిష్యత్తులో ఆస్తమా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

వైరల్ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు:
చిన్నపుడే వైరల్ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు గురైన కొందరు పిల్లల్లో పెద్దయ్యాక దీర్ఘకాలిక ఆస్తమా అభివృద్ధి చెందవచ్చు.

Read Also: Kollywood : ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో నలుగురు టాప్ కమెడియన్స్

కుటుంబ చరిత్ర:
ఒకవేళ తల్లిదండ్రులలో ఎవరికైనా ఆస్తమా ఉన్నట్లయితే, మీకు కూడా ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వాయు కాలుష్యం:
దుమ్ము, ధూళి వాతావరణంలో ఎక్కువగా గడిపే వారిలో ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారిలో ఇది సాధారణంగా ఎక్కువగా కనిపిస్తుంది.

ఇక ఆస్తమా హెచ్చరిక ilలక్షణాలు తేలికగా తీసుకోకండి!
అలాగే శ్వాస తీయడంలో ఇబ్బంది లేదా వేగంగా శ్వాస తీసుకోవడం, ఇంకా ఇన్ హేలర్ వాడినా కూడా మెరుగుదల కనిపించకపోవడం లాంటి లక్షణాలు కనిపించిన అవి ఆస్తమా లక్షణాలు కావచ్చు. అలాగే శారీరక శ్రమ లేకుండానే శ్వాస తీసుకోవడంలో తలెత్తే ఇబ్బంది, ఛాతీ దగ్గర ఒత్తిడి ఎక్కువగా ఉండడం, అధికంగా చెమట రావడం.. అలాగే ముఖం, పెదవులు నీలంగా మారడం లక్షణాలు కలిగి ఉన్న అవి ఆస్తమా లక్షణాలే.

Exit mobile version