WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఈసారి ఈ నగరాల్లోనే.. వేలం కూడా అప్పుడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) ఈ సంవత్సరం ఫిబ్రవరి విజయవంతంగా జరిగింది. ఇండియాలో ఉమెన్స్ లీగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్ మొదటి సీజన్ టోర్నీని ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఆ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు.
World Cup 2023: వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్ టికెట్ విక్రయాలు నేడే…
Also Read
ఇదిలా ఉంటే.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే WPL 2024 గురించి కొన్ని వార్తలు వినపడుతున్నాయి. మీడియాలో వస్తున్న తాజా నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది WPL 2024 సీజన్‌ను ఇండియాలోని రెండు నగరాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ నగరాల్లో ముంబై, బెంగళూరు ఉన్నాయి. అంతేకాకుండా.. ఐపీఎల్ తరహాలోనే డబ్ల్యుపీఎల్ సీజన్ నిర్వహించనున్నట్లు నివేదికలు వచ్చాయి. అన్ని జట్లు హోమ్-అవే సిస్టమ్‌లో రౌండ్-రాబిన్ మ్యాచ్‌లు ఆడతాయి. అయితే దీనికి సంబంధించి బీసీసీఐ అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
CM Nitish Kumar: నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ధ్వజం.. నేనే భారతీయురాలినై ఉంటే..
అంతేకాకుండా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ కోసం ఇంకా ఆటగాళ్ల వేలం తేదీని వెల్లడించలేదు. కొన్ని నివేదికల ప్రకారం.. WPL వేలం 2024 డిసెంబర్ 9న ముంబైలో నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఉమెన్స్ క్రికెట్ లీగ్ తదుపరి సీజన్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే మొదటి సీజన్‌లో ప్రతిదీ అలాగే ఉంటే.. ఈసారి కూడా 5 జట్లు పాల్గొంటాయి. మొత్తం 5 జట్లు రాబిన్-రౌండ్ ఫార్మాట్‌లో రెండుసార్లు మ్యాచ్‌లు ఆడతాయి. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. నంబర్-2, నంబర్-3 జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడతాయి. దిగువన ఉన్న రెండు జట్లు లీగ్ దశ నుంచి ఎలిమినేట్ అవుతాయి.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!