Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
- 2025 నవంబర్ 2.
- భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలుపు..
- నేటితో ఏడాది పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women Cricket World Cup 2025: భారత మహిళల క్రికెట్ చరిత్రలో 2025 నవంబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
ఈ సందర్భంగా బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోను పంచుకుంది. “ఎంతో ప్రత్యేకమైన ఫ్లాష్‌బ్యాక్.. కలల నుంచి గమ్యం వైపు సాగిన ఆ ప్రయాణం. మనం ఛాంపియన్లుగా నిలిచి ఏడాది పూర్తయ్యింది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోతో ప్రపంచకప్ విజయానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను మరోసారి అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. దీప్తి శర్మ 58 పరుగులు సాధించింది. స్మృతి మంధాన 45 పరుగులతో రాణించింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 299 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Also Read
- CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
- ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
- Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
- Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీతో పోరాడింది. ఆమె 101 పరుగులు చేసినప్పటికీ.. మిగతా బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. 45.3 ఓవర్లలో 246 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌటైంది. దీప్తి శర్మ ఐదు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. షఫాలీ వర్మ రెండు వికెట్లు తీయగా, శ్రీ చరణి ఒక వికెట్ సాధించింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీని అందించడమే కాకుండా భారత్ లో మహిళల క్రికెట్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎంతోమంది యువతులకు క్రికెటర్ కావాలనే కలను నిజం చేసుకోవచ్చనే నమ్మకాన్ని ఈ విజయం అందించింది. ఏడాది గడిచినా ఆ చారిత్రక క్షణాల జ్ఞాపకాలు అభిమానుల్లో ఇంకా తాజాగా ఉన్నాయి.
An exclusive flashback 🎬
A journey from Dream to Destiny ❤️
Here’s to one year of being 𝘾𝙝𝙖𝙢𝙥𝙞𝙤𝙣𝙨 🏆
#TeamIndia https://t.co/5FtD8JPRPj
— BCCI Women (@BCCIWomen) November 2, 2026
తాజావార్తలు
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
Prabhas: బాకీ తీర్చుకోనున్న ‘డార్లింగ్’ ప్రభాస్!
ట్రెండింగ్
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!