NTV Telugu Site icon

Insurance Claim: ఇన్సూరెన్స్ క్లెయిమ్‎ కోసం నాలుగేళ్లుగా పోరాడిన మహిళ.. చివరికి..

Lic

Lic

Insurance Claim: చనిపోయిన తన భర్త ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మహిళ సుదీర్ఘంగా నాలుగేళ్ల పాటు పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌తోపాటు, బోనస్‌ కూడా గెల్చుకుంది. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని ఘట్కోపర్‌కు చెందిన రేఖ వేద్ భర్త 2016 మార్చి 28, 2016 ఏప్రిల్ 15 తేదీల్లో వరుసగా రూ. మూడు లక్షలు, రూ. ఏడు లక్షల బీమా కవరేజీతో రెండు పాలసీలు తీసుకున్నారు. క్రమం తప్పకుండా పాలసీలకు ప్రీమియం చెల్లించాడు. ఐతే సదరు వ్యక్తి పాలసీ తీసుకునే సమయానికి 60 ఏళ్లు ఉన్నాయి. అప్పటికే 10 ఏళ్లుగా హై బీపీతోపాటు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు రేఖ వేద్ భర్త 2018 ఆగస్ట్ 15న అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మరణానంతరం బీమా క్లైమ్‌ కోసం మృతుడి భార్య రేఖ వేద్ ఎల్‌ఐసీని సంప్రదిస్తే.. ఆమె భర్త బీమా అప్లికేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చాడనే కారణంతో ఆమె ఆభ్యర్ధనను తిరస్కరించింది.

Read Also: Gujarat Farmer : రైతులకు రూ.630కోట్లు ప్రకటించిన ప్రభుత్వం

దీంతో రేఖ వేద్ ముంబై సబర్బన్ డిస్ట్రిక్ట్ కన్‌జ్యూమర్‌ డిస్ప్యూట్స్‌ రెసిడెన్షియల్‌ కమిషన్‌ ఫిర్యాదు చేసింది. ఎల్‌ఐసీ అభ్యంతరాలను కమిషన్‌ ఖండించింది. పాలసీలు జారీ చేసే ముందు మెడికల్‌ ఆఫీసర్‌ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్‌తో పాటు, ఆమె భర్త నింపిన ఫారమ్‌ను కూడా కమిషన్‌కు సమర్పించింది. ఐతే పాలసీ తీసుకున్న తేదీ నుంచి రెండేళ్ల తర్వాత ఎటువంటి అభ్యంతరాలు చెప్పడానికి అవకాశంలేదని పాలసీ రూల్స్‌లో ఎల్‌ఐసీ పేర్కొంది.

Read Also: Rishi Sunak meet Modi : మోదీ, రిషి సునాక్ భేటీ ముహూర్తం ఖరారు.. అప్పుడే దానిపై చర్చ

నిజానికి అవి ‘జీవన్ విమా పాలసీలు’. అంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు బీమా సౌకర్యం కల్పించేవన్నమాట. ఐతే ఈ కేసులో బీమా చేసిన వ్యక్తి అనారోగ్యంతో మరణిస్తే.. రూల్స్‌ ప్రకారం సదరు వ్యక్తి కుటుంబ సభ్యులకు బీమా మొత్తాన్ని చెల్లించాలని కమిషన్‌ ఎత్తి చూపింది. రూ. 10 లక్షల ఇన్సూరెన్స్‌తో పాటు నవంబర్ 2018 నుంచి ఆరు శాతం వడ్డీతో అక్యుములేటెడ్‌ బోనస్‌ ఇవ్వాలని ఆదేశించింది. దీంతోపాటు ఆమెను వేధింపులకు గురిచేసినందుకు రూ. 10,000, వ్యాజ్యం ఖర్చు రూ.5,000తో కలిపి మొత్తం సొమ్మును తక్షణమే చెల్లించాలని తెల్పింది.

Show comments