Child Marriages: అసోం ప్రభుత్వం బాల్య వివాహాలపై పెద్దఎత్తున అణచివేత ప్రారంభించడంతో తమ భర్తలు, కుమారులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించిన రాష్ట్రవ్యాప్త అణిచివేత శుక్రవారం ప్రారంభమైంది. రాబోయే ఆరు రోజుల పాటు కొనసాగుతుంది. మగవాళ్లను మాత్రమే ఎందుకు తీసుకెళ్లాలని, మా పిల్లలు ఎలా బతకాలని, మాకు ఆదాయ మార్గాలు లేవని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు 2,000 మందిని అరెస్టు చేసి, 4,004 కేసులు నమోదు చేశారు. 8,000 మంది నిందితుల జాబితా తమ వద్ద ఉందని, డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మతపరమైన సంస్థలలో వివాహ వేడుకలు జరిపిన 51 మంది పురోహితులు, కాజీలను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం వరకు, బిస్వనాథ్ జిల్లాలో అత్యధికంగా 137 మందిని అరెస్టు చేశారు, ధుబ్రిలో 126, బక్సాలో 120, బార్‌పేటలో 114, కోక్రాఝర్‌లో 96 మందిని అరెస్టు చేశారు.
Shaheen Afridi: షాహిద్ అఫ్రిది కూతురితో షహీన్ పెళ్లి..ఫోటోలు వైరల్
14 ఏళ్లలోపు బాలికలను వివాహం చేసుకున్న వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని, 14-18 సంవత్సరాల వయస్సు గల బాలికలను వివాహాలు చేసుకున్న వారిపై బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006 కింద కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది. మహిళలపై క్షమాభిక్షలేని, క్రూరమైన నేరాలపై జీరో టోలరెన్స్‌తో వ్యవహరించాలని పోలీసులను ఆదేశించినట్లు సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. అస్సాంలో మాతా శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది, రాష్ట్రంలో నమోదైన వివాహాలలో సగటున 31 శాతం నిషేధిత వయస్సులో ఉన్నందున బాల్య వివాహాలు ప్రాథమిక కారణం.
