NTV Telugu Site icon

Women Fight in Bus Video: బస్సులో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న మహిళలు.. ఓర్నీ..

Karnaaka (2)

Karnaaka (2)

రెండు కొప్పులు ఒక చోట ఉంటే గొడవలు రాకుండా ఎలా ఉంటాయని కొందరు ప్రముఖులు అంటున్నారు.. అది నిజమే అని చాలా ఘటనలు నిరూపితం చేసాయి.. బస్సులో సీటు కోసం, రైలులో సీటు కోసం కొట్టుకోవడం మనకు కామన్ గా కనిపించే విషయమే. ఎక్కువగా చాలా మంది సీటు నాదంటే నాది అని వాదులాడుకుంటారు. కానీ… మరీ దారుణంగా జుట్టుపట్టుకొని కొట్టుకోవడం, చెప్పులతో కొట్టుకోవడం, దారుణంగా దూషించడం మాత్రం చూసి ఉండరు ఇటీవల మహిళలు పబ్లిక్ ప్లేసులో కొట్టుకున్న వీడియోలు చాలానే ఉన్నాయి..

తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న ఘటన వెలుగు చూసింది.. ఆ ఫైట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియో కర్ణాటకలోని తుమకూర్‌కి చెందినది, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది.. బస్సులో సీటు విషయంలో మహిళలు పరస్పరం ఘర్షణ పడ్డారు, ఒకరి జుట్టు ఒకరు లాగారు.. ఇలా మాటల యుద్ధం మొదలైంది.. దీంతో సీటు కోసం కొట్లాటలు జరుగుతున్నాయి, గతంలో కూడా ఇలాంటి వీడియోలు బయటకు వచ్చాయి.

ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణికుల తాకిడి రోజు రోజుకీ పెరిగిపోతూ ఉంది. ఉచిత ప్రయాణం కావడంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సీట్ల కోసం మహిళలు గొడవ పడుతున్నారు. చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అనే కనీస ఇంగితజ్ఞానం లేకుండా చీరలు లాగి, సిగపట్లు పడుతున్నారు. శక్తి యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 20 శాతం వరకు మహిళలు బస్సుల్లో ఇలాంటి గొడవలు పడుతున్నట్టు కండక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు జరిగిన గొడవ వీడియో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..