Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో ఘోరం.. ఫ్లైఓవర్ సమీపంలో మహిళ శరీర భాగాలు లభ్యం

Delhi

Delhi

Woman’s chopped body parts found near flyover in east Delhi: దేశ రాజధానిలో మహిళ హత్య కలకలం సృష్టిస్తోంది. ఏడాది క్రితం జరిగిన శ్రద్ధా వాకర్ ఘటనను మరువక ముందే.. అదే తరహా ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీలో గల ఫ్లైఓవర్ సమీపంలో ముక్కలు చేయబడిన మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. ఉదయం 9.15 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. ఫ్లైఓవర్ సమీపంలో పలుచోట్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాధితురాలి శరీర భాగాలు, తల వంటి కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన శరీర భాగాలను వెలికితీసేందుకు పోలీసు బృందం ఫ్లైఓవర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తోంది. మహిళ ఎవరూ, ఆమెను ఎందుకు, ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిగిలిన శరీర భాగాల కోసం పలు బృందాలు కాలనీలోని పలు చోట్ల వెతుకుతున్నాయి.

Also Read: Minor Lovers Suicide: సిద్దిపేటలో తీవ్ర విషాదం.. ఉరేసుకుని మైనర్ ప్రేమ జంట ఆత్మహత్మ

గతేడాది 20 ఏళ్ల శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీనా పూనావాలా ఢిల్లీ అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈ హత్య కేసు దేశంలో సంచలనంగా మారింది. కొద్దికాలంగా సహజీవనం సాగిస్తున్న వీరు తరచు గొడవ పడేవారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి చేయడంతోనే ఆమెను హత్య చేసినట్టు చెబుతున్నారు. నేరం బయటకు పొక్కకుండా శ్రద్ధ వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిడ్జిలో పెట్టి, 18 రోజుల పాటు వాటిని ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తాను శ్రద్ధను హత్య చేసినట్టు పాలిగ్రాఫ్, నార్కో టెస్ట్ పరీక్షలో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా అంగీకరించాడు. దీంతో ఈ కేసు కొలిక్కి వచ్చింది.

Exit mobile version