NTV Telugu Site icon

Woman’s Body Found: యూనివర్సిటీలోని వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం.. ఏమైందంటే?

Noida University

Noida University

Woman’s Body Found In Water Tank At Noida University, Husband On The Run: యూపీలో గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్ నుంచి ఒక మహిళ మృతదేహాన్ని సోమవారం వెలికితీయడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరు కలిసి ఆమెను హత్య చేసి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భర్త సమీపంలోని జిమ్స్‌ ఆసుపత్రిలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగింది. ఆ గొడవే మహిళ హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఇప్పుడు ఆమె భర్త, అత్త కోసం వెతుకుతున్నారు. మహిళ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అదృశ్యమైన నిందితుడి కోసం బృందాలను ఏర్పాటు చేశారు.

Read Also: Sunita Williams Space Mission: సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వాయిదా, కారణం ఏమిటంటే?

సిమెంటు వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందిన వెంటనే, పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు.మృతదేహాన్ని శవపరీక్షకు పంపినట్లు సీనియర్ పోలీసు అధికారి శివహరి మీనా వెల్లడించారు. కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం బృందాన్ని ఏర్పాటు చేశామని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే ఈ విషయాన్ని బయటపెడతామని చెప్పారు.