Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Woman With 27 Gold Bars Enters India She Smuggled Them For Rs 2000

Gold Smuggling: రూ.2వేల కోసం రెండు కిలోల బంగారం స్మగ్లింగ్.. సరిహద్దులో పట్టుబడిన మహిళ

Published Date :April 29, 2023 , 8:30 am
By Mahesh Jakki
Gold Smuggling: రూ.2వేల కోసం రెండు కిలోల బంగారం స్మగ్లింగ్.. సరిహద్దులో పట్టుబడిన మహిళ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gold Smuggling: పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి 27 బంగారు కడ్డీలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) గురువారం అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీల బరువు 2 కిలోల కంటే ఎక్కువ. దాని విలువు దాదాపు రూ.1.29 కోట్లు ఉంటుందని అంచనా. మాణికా ధర్ (34)గా గుర్తించిన స్మగ్లర్ 27 బంగారు కడ్డీలను గుడ్డలో దాచి నడుముకు కట్టుకుంది. ఆమె బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాకు చెందిన మహిళగా అధికారులు గుర్తించారు.

Read Also: Woman Suicide: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వడం లేదని భార్య ఆత్మహత్య

బంగ్లాదేశ్‌కు చెందిన స్మగ్లర్‌ బంగారంతో సరిహద్దు దాటబోతున్నట్లు భారత చెక్‌పోస్టు వద్ద మోహరించిన బీఎస్‌ఎఫ్ మహిళా సిబ్బందికి సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న మహిళా జవాన్లు అనుమానం వచ్చిన వ్యక్తిని ఆపి సోదా చేయగా.. ఆమె దుస్తులలో దాచిపెట్టిన బంగారు బిస్కెట్లు కనిపించాయి. విచారణలో, పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లో గుర్తు తెలియని వ్యక్తికి బంగారు కడ్డీలను డెలివరీ చేయమని ఆమెకు సూచించినట్లు స్మగ్లర్ అంగీకరించింది. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని, ఆ పని కోసం రూ.2,000 అందుకోబోతున్నానని కూడా ఆమె అంగీకరించింది.స్మగ్లర్, స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం కస్టమ్ ఆఫీస్ పెట్రాపోల్‌కు అప్పగించారు. సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్, బీఎస్‌ఎఫ్‌ ప్రతినిధి ఒకరు జవాన్ల అప్రమత్తతను మెచ్చుకున్నారు. స్మగ్లర్లను అడ్డుకోవడంలో వారు సాధించిన విజయంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Border Security Force
  • BSF
  • Gold
  • Gold bars
  • gold seized

తాజావార్తలు

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

  • Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్‌ గేమ్‌..!

  • Yuvraj Singh 6 Sixes Story: “నా కొడుకు కెరీర్‌ను ముగించావు”.. యువరాజ్‌తో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి ఎమోషనల్!

  • Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!

  • Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions