Harassment: దేశం విడిచి వెళ్తే రూ.కోటి ఇస్తామంటున్నారు.. సిట్ దర్యాప్తుకు హాజరైన మహిళా కోచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harassment: హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన మహిళా కోచ్, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మంగళవారం పేర్కొన్నారు. హర్యానా క్రీడల మాజీ మంత్రి సందీప్ సింగ్ చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్టుగా చెబుతున్న మహిళా కోచ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను దేశాన్ని విడిచిపెట్టి వెళ్తే కోటి రూపాయలు ఇస్తామంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. హర్యానా పోలీసులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. చండీగఢ్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరైన అనంతరం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఈ ఆరోపణలు చేశారు.
“చండీగఢ్ పోలీస్ సిట్‌కి అన్నీ వివరంగా చెప్పాను.. పెండింగ్‌లో ఉన్న అంశాలను సిట్‌కి కూడా చెప్పాను. ఈ ఉదయం ముఖ్యమంత్రి ప్రకటన విన్నాను, ఇందులో ముఖ్యమంత్రి స్వయంగా సందీప్ సింగ్ పక్షం వహిస్తున్నారు. హర్యానా పోలీసులు నాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆమె అన్నారు. చండీగఢ్ పోలీసులు మాజీ మంత్రిని అరెస్టు చేయలేదని, పోలీసులు విచారించలేదని కోచ్ తరపు న్యాయవాది దీపాంశు బన్సాల్ ఆరోపించారు. “హర్యానా ముఖ్యమంత్రి సిట్‌ని నియమించారు. అంతా సిట్‌కి చెప్పబడింది. పోలీసులు సందీప్ సింగ్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదు. ఇది నాన్ బెయిలబుల్ నేరం. సందీప్ సింగ్‌ను పిలవలేదు, కానీ ఆమెకు నాలుగుసార్లు కాల్ చేసారు,” అని బన్సాల్ అన్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
IT Raids: మళ్లీ ఐటీ దాడులు.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లలో సోదాలు
క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా కోచ్ తండ్రితో పాటు ధన్‌ఖర్ ఖాప్ ప్రతినిధులు మంగళవారం అంబాలాలో హర్యానా హోం మంత్రి అనిల్ విజ్‌ను కలిశారు. గత నెలలో జూనియర్ అథ్లెట్ కోచ్‌గా ఉన్న మహిళ, ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డr) కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది, ఇందులో మంత్రి గత ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు పదేపదే సందేశాల ద్వారా తనను వేధించారని ఆరోపించారు. ఆమెను అనుచితంగా తాకడంతోపాటు మెసేజ్‌లలో బెదిరించారని ఆమె చెప్పారు. హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం సందీప్ సింగ్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని మరియు ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..